Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Golden Age of India: The rise & fall of the Gupta Empire (320-550 CE)
Transcript
- 0:01ప్రపంచ చరిత్ర పుటలలో కొన్ని పేజీలు రత్తాక్షరాలతో లెక్కించబడి
- 0:05ఉంటే మరికొన్ని పేజీలు కన్నీళ్లతో తడిసిపోయి ఉంటాయి.
- 0:09కానీ భారతీయ చరిత్రలో మాత్రం కొన్ని పేజీలు స్వచ్ఛమైన బంగారం
- 0:14తో లిఖించబడ్డాయి. ప్రపంచం మొత్తం అజ్ఞానాంధకారంలో
- 0:19ఉన్నప్పుడు మన దేశం విజ్ఞాన జ్యోతులను వెలిగించింది.
- 0:23రోమన్ సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో ఇక్కడ గంగా నదీ తీరాన ఒక
- 0:27మహా సామ్రాజ్యం వెలుగులీనుతోంది. భారతదేశాన్ని సోనీకి చిడియా అంటే
- 0:33బంగారు పిచ్చు కానీ ఎందుకు పిలిచేవారు?
- 0:36అప్పట్లో సామాన్యుడు కూడా బంగారు నాణేలను ఎలా వాడేవాడు సున్నాను
- 0:41కనుగొన్న ఆర్యభట్ట నుండి మేఘాలను రాయబారులుగా మార్చిన కాళిదాసు
- 0:45వరకు అందరూ అదే కాలంలో ఎందుకు జన్మించారు?
- 0:50ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమి గుప్త సామ్రాజ్యం సామాన్య శక 320
- 0:56నుండి 550 వరకు సాగిన ఆ కాలాన్ని చరిత్రకారులు ది గోల్డ్ రేంజ్ ఆఫ్
- 1:01ఇండియా అని పిలుస్తారు. కాల గర్భంలో కలిసిపోయిన ఆ
- 1:05సువర్ణాధ్యాయాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
- 1:09అటువంటి అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజుకి మన
- 1:12వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:16తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:22చాప్టర్. పునాది మరియు ఆరంభం.
- 1:27ఈ మహా సామ్రాజ్య ప్రస్థానం సామాన్య శకం మూడవ శతాబ్దం చివరలో
- 1:31మొదలైంది. శ్రీగుప్తుడు గుప్తవంశానికి
- 1:35మూలపురుషుడు. నేడు మనం బీహార్‌గా పిలుచుకునే
- 1:38మగధ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించి మహారాజు అని
- 1:43బిరుదుతో పాలించాడు. ఆయన తరువాత ఆయన కుమారుడు
- 1:47ఘటోక్కజోడు పాలన కొనసాగించాడు. వీరిద్దరూ స్వతంత్ర రాజులు
- 1:52కాకపోవచ్చు. బహుశా భూషణులకు సామంతులుగా ఉండి
- 1:56ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తారు.
- 1:59కానీ గుప్త వంశ చరిత్ర గతిని మార్చింది మాత్రం సామాన్య శకం 320
- 2:05లో సింహాసనాన్ని అధిష్టించిన మొదటి చంద్రగుప్తుడి ద్వారాని.
- 2:09ఆయన కేవలం మహారాజు కాదు. మహారాజాధిరాజు ఆయన విజయం వెనుక ఒక
- 2:16ఆసక్తికరమైన కోణం ఉంది. అది ఆయన వివాహం.
- 2:20ఆనాడు అత్యంత శక్తివంతమైన లిచ్చవి వంశానికి చెందిన యువరాణి కుమార
- 2:25దేవిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ వివాహ సంబంధం గుప్తుల రాజకీయ
- 2:31శక్తిని అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే చంద్రగుప్తుడు
- 2:36ముద్రించిన బంగారు నాణేలపై ఒకవైపు తన బొమ్మ మరోవైపు తన భార్య కుమార
- 2:42దేవి బొమ్మను ముద్రించారు. భార్యకు ఆమె వంశానికి అంత గౌరవం
- 2:47ఇచ్చిన రాజు ఆయన. గుప్తుల కాలంలో ముద్రించబడిన
- 2:51నాణేలను అవి తయారుచేయబడిన లోహాన్ని బట్టి వివిధ పేర్లతో
- 2:55పిలిచేవారు. బంగారు నాణేలను దీనార్లని
- 2:59పిలిచేవారు. ఈ నాణేలు గుప్తుల కాలం నాటి
- 3:02ఆర్థికశ్రేయస్సు మరియు కళాత్మక నైపుణ్యానికి అత్యుత్తమ ఉదాహరణలు.
- 3:08వెండి నాణేలను రూపక లేదా రూప్యకాని పిలిచేవారు.
- 3:12రాగి నాణేయాలను ద్రాజ్మాని పిలిచేవారు.
- 3:16ఈ నాణేలు వివిధ రకాలైన రూపకల్పనలను కలిగి ఉండేవి.
- 3:21నాణ్యాల ముందు భాగంలో బాలక చక్రవర్తి బొమ్మ వెనుక భాగంలో
- 3:25దేవతల చిత్రాలు లేదా పురాణాల నుండి అంశాలు ఉండేవి.
- 3:30చాప్టర్ టూ సముద్రగుప్తుడు ద గ్రేట్ కాంకరర్.
- 3:36మొదటి చంద్రగుప్తుడి తర్వాత భారతదేశ చరిత్ర గర్వించదగిన
- 3:40చక్రవర్తి సింహాసనమేక్కాడు. ఆయనే సముద్రగుప్తుడు.
- 3:45ఆయన గురించి మనకు ఎలా తెలిసింది? ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ అంటే
- 3:50నేటి అలహాబాద్‌లో ఒక అశోక స్తంభం ఉంది.
- 3:54దాని మీద సముద్రగుప్తుడి ఆస్థాన కవి హరిశీనుడు చిక్కించిన సంస్కృత
- 3:59శాసనం ఆయన విజయదాధనం 33 వాక్యాలలో వివరిస్తుంది.
- 4:04చరిత్రకారులు ఆయనను ఇండియన్ నెపోలియన్ అని అంటారు గానీ,
- 4:08నిజానికి నెపోలియన్ కంటే సముద్రగుప్తుడి గొప్పవాడు.
- 4:12ఎందుకంటే నెపోలియన్ తన చివరి యుద్ధం ది బ్యాటిల్ అఫ్ వాటర్‌లో
- 4:17ఓడిపోయాడు. సముద్రగుప్తుడు తన జీవితకాలంలో
- 4:21అపజయం అనేది ఎరుగడు. ఆయన దండయాత్రలు రెండు రకాలు.
- 4:26ఆర్యవర్గం అంటే ఉత్తరభారతం. అక్కడి తొమ్మిది మంది రాజులను
- 4:31సమూలంగా నాశనం చేసి వారి రాజ్యాలను తన రాజ్యంలో
- 4:35కలిపేసుకున్నాడు. దక్షిణపథం అంటే దక్షిణ భారతం.
- 4:41ఇక్కడ పల్లవరాజులతో సహా 12 మంది రాజులను ఓడించాడు.
- 4:45కానీ వారి రాజ్యాలను లాక్కోలేదు. వారిని సామంతులుగా మార్చుకుని
- 4:51గప్పం కట్టించుకుని వదిలేశాడు. దీనిని ధర్మ విజయం అని అంటారు.
- 4:57ఒకవైపు అంతటి యుద్ధవీరుడు, మరోవైపు గొప్ప సంగీతకారుడు కూడా.
- 5:02ఆయన ముద్రించిన నాణేలపై మీనవాయిస్తూ కనిపిస్తాడు.
- 5:06అందుకే ఆయనను కవిరాజు అని కూడా పిలిచేవారు.
- 5:10యుద్ధం మరియు కల రెండు ఒకే మనిషిలో ఉండటం చాలా అరుదు.
- 5:15చాప్టర్ త్రీ విక్రమాదిత్యుడు, కథ మరియు కీర్తి.
- 5:21సముద్రగుప్తుడి మరణం తరువాత చిన్నపాటి రాజకీయాని స్థితి
- 5:26నెలకొన్నది. రామగుప్తుడని బలహీన రాజు గురించి
- 5:30కొన్ని కథలు ఉన్నా చరిత్రలో నిలిచిపోయింది మాత్రం రెండవ
- 5:34చంద్రగుప్తుడు. ఆయనని మనం విక్రమాదిత్యుడని
- 5:37పిలుస్తాం. ఆయన కాలం నాటికి పశ్చిమ
- 5:41భారతదేశంలో సెకరాజు గుప్తులకు తలనొప్పిగా మారారు.
- 5:45విక్రమాదిత్యుడు ఆ శకరాజులను అంతం చేసి అరేబియా సముద్రం వరకు గుప్త
- 5:50సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీని వల్ల విదేశీ వాణిగ్యం పెరిగి
- 5:55రోమన్ బంగారం దేశంలోకి వరదలా వచ్చి పడింది.
- 5:59ఇదే సమయంలో చైనా నుండి ఒక బౌద్ధ సన్యాసి భారతదేశానికి వచ్చాడు.
- 6:05అతని ఫాకీం ఆయన రాసిన పుస్తకంలో ఏ ఉందో తెలుసా?
- 6:10గుప్తల రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
- 6:14ఎవరు దొంగతనాలు చేయరు. ఇళ్లకి తాళాలు కూడా వేయరు.
- 6:19రాజులు క్రూరమైన శిక్షలు వేయరు. ఆసుపత్రులు ఉచితంగా వైద్యం
- 6:24అందిస్తున్నాయి అని రాశాడు. ఒక విదేశీయుడు మన దేశం గురించి
- 6:29ఇంత గొప్పగా రాశాడంటే ఆ పాలన ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
- 6:35విక్రమాదిత్యుడి సభలో నవరత్నాలుండేవారు.
- 6:39అందులో కవి కాళిదాసు నిఘంటువు వ్రాసిన అమరసింహుడు, ఖగోళ
- 6:44శాస్త్రవేత్త వరాహ మిహిరుడు ఇలా తొమ్మిది మంది దిగ్గజాలు
- 6:47ఉండేవారు. రాజు కేవలం కత్తి పట్టడమే కాదు,
- 6:51కవులను కూడా గౌరవించాలని ఆయన నిరూపించాడు.
- 6:55అంతటి విక్రమాదిత్యుడికి సంబంధించి మనం గతంలో చేసిన
- 6:59వీడియోల ప్లేలిస్టును చూడని వారి కోసం పొందుపరుస్తున్నాం.
- 7:04చాప్టర్ ఫోర్ విద్య విజ్ఞానం మరియు వాస్తశిల్పం.
- 7:10ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం.
- 7:13గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారు?
- 7:17మొదటిది సైన్స్. పాశ్చాత్య దేశాలు భూమి
- 7:20బల్లపరుపుగా ఉందని నమ్ముతున్న కాలంలో ఆర్యభట్ట సూర్య సిద్ధాంతం
- 7:25రాశారు. భూమి గుండ్రంగా ఉందని, తన చుట్టూ
- 7:29తాను తిరుగుతుందని సూర్య చంద్రగ్రహణాలు రాహు కేతువుల వల్ల
- 7:33కాదు, నీడల వల్ల వస్తాయని ఆనాడే చెప్పాడ ఆయన.
- 7:38అలాగే సున్నా విలువను దశాంస పద్ధతిని ప్రపంచానికి అందించింది
- 7:42ఈ కాలమే. రెండవది మెటల్ అర్జీ అంటే
- 7:47లోహశాస్త్రం ఢిల్లీలోని కుతుబ్ మినార్ పక్కన ఒక ఇనుప స్తంభం
- 7:53ఉంది. అది గుప్తుల కాలం నాటి గత 1600
- 7:57ఏళ్లుగా ఎండలో వానలో కాలుష్యంలో అది అక్కడే స్థిరంగా నిలిచి ఉంది.
- 8:03కానీ నేటికీ దానికి ఒక చిన్న తుప్పు మరక కూడా పట్టలేదు.
- 8:07ఈనాటి మోడర్న్ టెక్నాలజీ కూడా అంతటి స్వచ్ఛమైన ఇనుమును తయారు
- 8:12చేయలేకపోతోంది. మూడవది విద్య రెండవ చంద్రగుప్తుడి
- 8:17తర్వాత వచ్చిన కుమారగుప్తుడు. ప్రపంచ ప్రఖ్యాత నలందా
- 8:21విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇక్కడ కేవలం బౌద్ధమతమే కాదు,
- 8:27గణితం, వైద్యం, తర్కం, వ్యాకరణం నేర్పించేవారు చైనా, కొరియా,
- 8:33జపాన్ల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు.
- 8:36అదొక ఆక్స్ఫర్డ్. అదొక హార్వర్డ్.
- 8:40ఇక నాలుగవది కళలు అత్యంత గుహల గోడలపై వేసిన చిత్రాలు ఆ కాలం
- 8:46నాటివే. సహజమైన రంగులతో వేసిన ఆ చిత్రాలు
- 8:50నీటికి చెక్కుచెదరలేదు. అలాగే దేవాలయ నిర్మాణం ఒక పద్ధతి
- 8:55ప్రకారం శిఖరాలతో నిర్మించడం మొదలైంది.
- 8:58గుప్తుల కాలంలోని. చివరగా చాప్టర్ ఫైవ్.
- 9:02పతనం అస్తమించిన సూర్యుడు. ఏ వెలుగుకైనా చీకటి తప్పదు.
- 9:09కుమార గుప్తుడి పాలన చివరి నాటికి భారతదేశంపై ఒక భయంకరమైన ముప్పు
- 9:14విరుచుకుపడింది. వారే హూనుడు మధ్య ఆసియా నుండి
- 9:19వచ్చిన ఈ తెగలు విపరీతమైన విధ్వంసాన్ని సృష్టించాయి.
- 9:23అప్పుడు ఆపద్బాంధవుడిలా వచ్చాడు. స్కందగుప్తుడు పూనులను
- 9:28తరిమికొట్టి దేశాన్ని రక్షించాడు. కానీ ఈ నిరంతర యుద్ధాల వల్ల
- 9:33రాజకోశాకారం పూర్తిగా ఖాళీ అయిపోయింది.
- 9:37స్కందగుప్తుడి తరువాత వచ్చిన రాజులు బలహీనులు ఒకపక్క ఊహనుల
- 9:42దాడులు మరోపక్క అంతర్గత కలహాలు, సామంతులు స్వతంత్రులుగా
- 9:47ప్రకటించుకోవడం, దీనికి తోడు బౌద్ధమతంపై రాజుల ఆసక్తి పెరిగి
- 9:51సైన్యం పై శ్రద్ధ తగ్గడం వెరసి సామాన్య శకం 550 నాటికి ఆ మహా
- 9:57సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది.
- 10:01గుప్త సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు.
- 10:04కానీ ఆ స్వర్ణ యుగంతాలు వెలుగులు నీటికి మనల్ని నడిపిస్తున్నాయి.
- 10:10మనం వాడి సంఖ్యలలో మనం ఆరాధించే దేవాలయాలలో మనం చదివే కావ్యాలలో
- 10:15గుర్తుల ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు.
- 10:19భారతదేశం వంటి కేవలం మట్టి కాదు అదొక గొప్ప విజ్ఞాన గని అని
- 10:24ప్రపంచానికి చాటి చెప్పిన కాలం అది.
- 10:27ఆ చరిత్రను తెలుసుకోవడం దానిని భావితరాలకు అందించడం మన బాధ్యత.
- 10:32ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
- 10:35ఇప్పుడు మీ కోసం ఒక ప్రశ్న గుప్తుల కాలంలో ముద్రించబడిన
- 10:40బంగారు నాణేలను ఏమని పిలిచేవారు దీనారాలు రూపక పన్న లేదా నిష్క
- 10:47సమాధానం మన వీడియోలోనే ఉంది. తెలుసుకోగలిగితే క్రింద కామెంట్
- 10:52చేయండి. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 10:55చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 10:59కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చేసిన రిసర్చ్
- 11:04ప్రెసెంటేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
- 11:08మన చరిత్రను పదిమందికి పంచడానికి షేర్ చేయండి.
- 11:12ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మీ వాయిస్ ఆఫ్ మహిధర్
- 11:17ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 11:20ప్రక్కని ఉన్న గంట గుర్తును కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి.
- 11:24వీడియో కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్
- 11:27మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.
- 11:32మరో వీడియోలో మళ్లీ కలుద్దాం. జై హింద్.