Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Chhinnamasta: The Headless Goddess of Tantra | స్వయం శిరః ఖండిత!
Transcript
- 0:01వారణాసి మూవీ టీజర్లో కనిపించిన తల లేని దేవత విగ్రహం
- 0:05ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం ఆ విగ్రహం చిత్రం
- 0:10యొక్క కథనానికి లోతైన సంబంధాన్ని సూచించే విధంగా ముఖ్యంగా రుద్రుడి
- 0:15పాత్రకు సంబంధించి ప్రాముఖ్యత కలిగినట్లుగా చిత్రీకరించబడింది.
- 0:20విగ్రహం, ఉనికి అనుబంధ సన్నివేశాలు, దాని ప్రతీకవాదం
- 0:25మరియు చిత్రం యొక్క ఇతివృత్తాల గురించి ఎన్నో చర్చలకు ఊహాగానాలకు
- 0:30దారితీసింది. టైమ్ ట్రావెల్ మరియు పునరుజన్మల
- 0:34యొక్క అన్వేషణలు సాగే ఈ చిత్రంలో చూపించబడిన ఆ దేవత ఎవరో ఈరోజు
- 0:39తెలుసుకుందాం. ఆది అంతం లేని ఓ మహాశక్తి ఆ దైవం
- 0:45సమస్త లోకాలను సృష్టించడమే కాకుండా వాటి స్థితి లయకారక
- 0:49బాధ్యతలు కూడా ఆ నిరాకార పరబ్రహ్మమే నిర్వహిస్తాడని మన
- 0:54శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ మహత్తర కార్యక్రమం
- 0:58క్రమబద్ధంగా కొనసాగడానికి ఎన్నో విభాగాలు, వాటి క్రింద మరెన్నో
- 1:03శాఖలు, ఉపశాఖలు ఉంటాయి. ఆయా విభాగాలు, శాఖలు సమర్థవంతంగా
- 1:09పనిచేయడానికి ముక్కోటి దేవతలు వెలిశారని మన వేదాలు
- 1:13తెలియబరుస్తున్నాయి. ఆ దేవీ దేవతలలో ఒక్కొక్కరికి
- 1:17ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలకు తగ్గట్లుగానే వారికి
- 1:22శక్తులు ఉంటాయి. ఆ దేవతలందరిలో మన కొత్త తరం
- 1:26వారికి తెలిసింది చాలా కొద్దిమంది అని చెప్పవచ్చు.
- 1:30అలా మనకు తెలియని దేవతా స్వరూపాలు ఎందరో ఉంటారు.
- 1:34మన లాంటి సామాన్యులకు తెలియని ఆ దేవి దేవతలలో కొన్ని ఉగ్ర
- 1:38స్వరూపాలు ఉన్నాయి. అవి ఎంత ఉగ్రంగా ఉంటాయంటే వాటిని
- 1:43చూస్తే ఎలాంటి వారికైనా గుండెల్లో గుబులు పుట్టక మానదు.
- 1:47అటువంటి వాటిలో మహోగ్ర స్వరూపం అత్యంత భయంకరమైన రూపమే అయినా ఆ
- 1:53రూపంలో. ఆ సందేశం దాగి ఉన్న దేవతే వారణాసి
- 1:57చిత్రం టీజర్లో మనకు కనిపించిన తల లేని దేవత ఆ తల్లి పేరే చిన్న
- 2:03మస్తాదేవి. అసలు ఎవరి చిన్న మస్తాదేవి ఆవిడ
- 2:07రూపం ఎందుకంత భయంకరంగా ఉంది? ఆవిడ రూపంలో ఉన్న మహాసందేశం
- 2:12ఏమిటి? అంతటి ఉగ్రరూపిణిని అసలు ఎవరు
- 2:16కొలుస్తారు వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి.
- 2:19అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 2:24చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 2:28ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 2:33పంచభూతాలు, మహాశక్తులు, వాటి ఉపశక్తుల ఆజ్ఞలతోనే సంస్థలోకాలు
- 2:39నడుస్తాయని మన హైందవ ధర్మంలోని పురాణాలలో చెప్పబడింది.
- 2:44ఆ శక్తులలో మనం నిత్యం పూజించేటటువంటి కొన్ని శాంత
- 2:47స్వరూపాలుంటే మరికొన్ని శక్తులు చూడగానే ఒళ్లు గగుర్పొడిచేంత
- 2:52భయంకర స్వరూపాలను కలిగి ఉంటాయి. అయితే అవి కూడా దేవతా శక్తులే అని
- 2:58వాటి పని కూడా లోకరక్షనే అని పండితులు చెబుతున్నారు.
- 3:03ఉదాహరణకు మనం ఇళ్లలో వాడే లైట్లు, ఫ్యాన్ ల వంటి పరికరాలు నడవాలంటే
- 3:08విద్యుత్ శక్తి అవసరం. విద్యుత్ మనకు.
- 3:11మంచి చేస్తుంది కదా అని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే
- 3:14బుగ్గే. తెలిసి ముట్టుకున్న తెలియక
- 3:17ముట్టుకున్న ముట్టుకున్న వారి పరిస్థితి అల్లకల్లోలమైపోయినట్లే.
- 3:21ఉగ్రశక్తుల పనితీరు కూడా అలాగే ఉంటుంది.
- 3:25తమ కర్తవ్య నిర్వహణ ప్రకారం లోకాలకు మంచి చేయడమే అయినా ఆ
- 3:30స్వరూపాల గుండె మహాశక్తుల వల్ల అవి మహోగ్రంగా కనిపిస్తాయని.
- 3:35తెలిసి గానీ, తెలియకుండా గానీ వాటి పట్ల అపరాధం జరిగితే ముప్పు
- 3:39తప్పదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
- 3:43అటువంటి మహోగ్రశక్తులలో ఒకటి ఈరోజు మనం చెప్పుకుంటున్న తలలేని
- 3:48దేవత చిన్న మస్తాది. సంస్కృతంలో చిన్న మస్తా అంటే
- 3:52నరికిన శిరస్సు అని అర్థం. తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను
- 3:57చిన్నముండగా కొలుస్తారు. ఆమె జన్మదినాన్ని చిన్నమస్తా
- 4:02జయంతిగా జరుపుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం
- 4:06శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది.
- 4:10రెండువేల 20 ఆరవ సంవత్సరంలో ఏప్రిల్ 30 వ తేదీన చిన్నమస్తా
- 4:15జయంతిని జరుపుకోబోతున్నాం. అదే రోజున మరో ఉగ్రరూపమైన నరసింహ
- 4:20జయంతి కూడా సకల లోకాలను నడిపించే ఆదిపరాశక్తి ఆ మహత్తర కార్యం కోసం
- 4:27తన శక్తిని విభజించగా అవి 10 శక్తులుగా దశ మహావిద్యలుగా
- 4:31రూపాంతరం చెందాయని తెలుస్తోంది. అలా ఆవిర్భవించిన దశమహా విద్యలలో
- 4:37ఒకరి చిన్నమస్తా దేవి ఈవిడను వజ్ర వైరోచిని ప్రచండ చండీ అని కూడా
- 4:43పిలుస్తారు. ఉత్తరభారతదేశంలో ప్రత్యేకించి
- 4:47హిమాచల్ ప్రదేశ్ లో ఈవిడ చింతపూర్ణి దేవిగా ప్రసిద్ధి
- 4:51గాంచారు. ఈవిడ రూపాన్ని చూసిన వారు ఎవరైనా
- 4:55ఒక క్షణం పాటైనా భయకంపితులు కాక మానరు.
- 4:58అటువంటి భయంకర స్వరూపం వెనుక ఎంతో పరమార్ధం దాగి ఉందని మన
- 5:03శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చిన్న మస్తాదేవి స్వరూపం యొక్క
- 5:08మర్మం గురించి తెలియాలంటే ముందుగా ఆవిడ రూపం ఎలా ఉంటుందో
- 5:12తెలుసుకోవాలి. ఒక పద్మంలో సృష్టి కార్యం
- 5:16జరుపుతున్న ఓ జంటపై తన కాలును మోపి తొక్కుతున్నట్లుగా
- 5:20చిన్నమస్తాదేవి నిలబడి ఉంటుంది. కాళికామాతలాగానే మెడలోపురలేదండా
- 5:26సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి ఉంటుంది.
- 5:30ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని తన తలను తానే నరుక్కున్నట్లుగా
- 5:34కనిపిస్తూ మరో చేతిలో తన తలను పట్టుకుని ఉంటుంది.
- 5:38ఆవిడ శరీరం నుంచి మూడు రక్తధారలు పొంగి వస్తుంటే వాటిలో ఒక ధారను
- 5:44ఆవిడే తాగుతున్నట్టుగా కనిపిస్తుంది.
- 5:47చిన్న మస్తాదేవి పక్కన ఆమె సహచరులైన జై విజయలనబడి డాకినీ
- 5:52వారిణులు నిలబడి మరో రెండు రక్తపు ధారలను స్వీకరిస్తున్నట్లు
- 5:56కనిపిస్తారు. చూడటానికి ఎంతో భయంకరంగా కనిపించే
- 6:01ఆ రూపం వెనుక ఎంతో పరమార్ధం దాగి ఉందని పండితులు చెబుతారు.
- 6:06చిన్న మస్తాదేవి కాలి క్రింద మైథునం జరుపుకుంటున్న స్థితిలో
- 6:10ఉన్న జంటను సృష్టి కార్యంలో ఉన్నట్లుగా భావిస్తే వారిపై ఆమె
- 6:15కాలు మోపి త్రొక్కడాన్ని వినాశన కారకంగా సూచిస్తున్నట్లు
- 6:19భావించాలి. ఆ జంటను శృంగార దేవదంపతులైన రతీ
- 6:23మన్మథులుగా చెబుతారు. ఈ సమస్త లోకాలలో సృష్టించబడిన
- 6:28ప్రతి దానికి అంతం ఖచ్చితంగా ఉంటుంది.
- 6:32అలా ఈలోకంలో జరిగే సృష్టి స్థితి లయలు తన ఆధీనంలోని ఉంటాయని సందేశం
- 6:38ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక చిన్న మస్తాదేవి రూపంలో తన
- 6:42తలను తానే నరుక్కున్నట్లు కనిపించడం వెనుక కూడా ఒక పరమార్థం
- 6:46దాగి ఉంది. తల అనేది మన అహంకారానికి నేను అనే
- 6:51భావానికి గుర్తు. తెల్లను నరుక్కున్నట్లు చూపడం
- 6:54అంటే మనలోని అహంకారాన్ని చెడు ఆలోచనలను వదిలిపెట్టి దేవుడితో
- 7:00ఏకం కావాలని అర్థం. అమిత్ జ్ఞానాన్ని సాధించాలన్న ఆ
- 7:05తల్లిని ఉపాసన చేయాలన్నా, ముందుగా ఆ హాన్ని పూర్తిగా పక్కనబెడితేనే
- 7:10అది సాధ్యపడుతుందని అర్థం. అందులో మనకు కనిపిస్తుంది.
- 7:15సహజంగా శక్తి ఆరాధన చేసే వారు దశ మహావిద్యలను ఉపాసన చేయాలని
- 7:20ఆశపడతారు. ఆదిపరాశక్తి 10 అవతారాల
- 7:23పరమార్ధాన్ని వాటిలోని శక్తిని సాధించి ఆ శక్తితో ఆస్తులను
- 7:28రక్షించడానికి రూపొందించిన విద్యలన్నీ దశ మహావిద్యాలని
- 7:32అంటారు. ఆదిపరాశికి 10 అవతారాలలో
- 7:36చిన్నమస్తాదేవి కూడా ఒకరు కావడంతో దశ మహావిద్యలలో ఆవిడ ఉపాసన కూడా
- 7:41ఉంటుంది. అందువల్ల ఆవిడను ఉపాసించాలంటే
- 7:45ముందు అహాన్ని పూర్తిగా పక్కనపెట్టాలని చెప్పడానికి
- 7:48నరికిన తలను తన ఎడమ చేతిలో పట్టుకుని చూపిస్తుందని
- 7:52ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఇక చిన్న మస్తాదేవి రూపంలో
- 7:57కనిపించే మరో భయంకరమైన అంశం. ఆవిడ శరీరంలోంచి బయటకు వస్తున్న
- 8:02మూడు రక్తధారాలు వాటిలో ఒకటి ఆవిడ మరో రెండు డాక్యునీ వారణులు
- 8:08త్రాగుతుండడం మనం గమనించవచ్చు. దీని వెనుక కూడా ఓఠార్థం దాగి
- 8:13ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన
- 8:17విద్యలలో యోగవిద్య ఒకటి. యోగవిద్యలో అత్యంత ఉత్కృష్టమైన
- 8:22ఉపవిద్య కుండలేని విద్య ఎవరైతే యోగవిద్యలోని కుండలిని విద్యను
- 8:27సాధించగలుగుతారో వారు అత్యంత శక్తివంతులైన మహర్షులుగా అవతరించి
- 8:33లోక కళ్యాణం కోసం పాటుపడతారని తెలుస్తోంది.
- 8:37కుండలిని విద్యను సాధించినప్పుడు శరీరంలోని సప్తచక్రాలను ఓ క్రమ
- 8:41పద్ధతిలోకి తీసుకురావడానికి ఈడ పింగళ సుషుమ్నానబడే మూడు నాడుల
- 8:47గుండానే శక్తి అనేది ప్రవహిస్తుంది.
- 8:50మన శరీరంలో జరిగే రక్త సరఫరా కూడా ఈ మూడు నాడుల గుండానే
- 8:55ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- 8:58అందువల్లనే చిన్నమస్తాదేవి ఆకారంలో మూడు రక్తధారలు మనకు
- 9:02కనిపిస్తాయి. ఇక ఆ రక్తాన్ని తాను తన సహచరులైన
- 9:07డాతిని, వారిని త్రాగడం వెనుక పరమార్థం ఏమిటంటే, కుండలి నీ
- 9:11విద్యను సాధించే సమయంలో శక్తినియంత్రణ అనేది ఎంతో ముఖ్యం.
- 9:16ఆ శక్తి బయటకు వెళ్లకుండా మనలోనే ఓ క్రమ పద్ధతిలో కదిలే విధంగా
- 9:21ఒడిసి పట్టుకోవాలని తెలియజేస్తున్నట్లుగా పండితులు
- 9:25చెబుతున్నారు. దశ మహావిధ్యలను అవపోసన బట్టి
- 9:29వారిగా చిన్నమస్తాదేవి ప్రక్కన కనిపించి డాక్యునీ వారినలుగా
- 9:33తనలోని గుణాలను చూపించడానికి ఆ ఇద్దరు సహచరుల రూపాలను
- 9:38సృష్టించిందని, ఆ రెండు రూపాలు ఆమెలో భాగమేనని చెబుతారు.
- 9:44అందువల్ల ఇక్కడ చిన్నమస్తాదేవి శరీరంలో నుంచి వస్తున్న రక్తాన్ని
- 9:48డాకీని వారినలు త్రాగడం అంటే ఆమె శక్తిని వారు
- 9:52ఒడిసిపట్టుకున్నట్లుగా అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు
- 9:56చెబుతున్నారు. అమ్మ వారి విచిత్ర రూపం వెనుక
- 10:00ఉన్న గొప్ప త్యాగం అహంకారాన్ని వదిలివేసే తత్వం మనకు ఎన్నో జీవిత
- 10:05పాఠాలను నేర్పుతుంది. అంతటి మహోగ్ర స్వరూపమైన చిన్న
- 10:09మస్తాదేవి రూపం వెనుక ఇంతటి పరమార్థం దాగి ఉన్న ఆవిడ
- 10:13ఉగ్రశక్తి కావడం చేత మన లాంటి సామాన్యులు ఆమెను పూజించలేరని,
- 10:19ఆమెను కేవలం దశ మహావిద్యా సాధకులు శక్తి ఉపాసకులైన శైక్తియులు,
- 10:24తాంత్రికులు మాత్రమే పూజించగలుగుతారని తెలుస్తోంది.
- 10:28చిన్నమస్తా భగవతి ఆలయాలలో ఒకటి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంగఢ్
- 10:33జిల్లా రాజ్రప అని చిన్న గ్రామంలో ఉంది.
- 10:37ఈ ప్రాంతం చాలా పచ్చగా కొండలతో, అడవులతో నిండి ఉంటుంది.
- 10:42ఇక్కడే దామోదర్ భైరవి అని రెండు నదులు కలుస్తాయి.
- 10:46ఈ రెండు నదుల సంగమ ప్రదేశం దగ్గరే అమ్మవారి ఆలయం ఉంది.
- 10:51అందుకే ఈ ప్రాంతంలో పవిత్రమైన శక్తి ఉందని నమ్ముతారు.
- 10:56మరొక ఆలయం నేపాల్ లోని సప్తర్ జిల్లా రాజ్‌బిరాజ్, దక్షిణ
- 11:00సరిహద్దు ప్రాంతంలోని చిన్న మస్తా సఖాడా గ్రామంలో ఉంది.
- 11:05ఈ ఆలయాలు ప్రజల కోరికలను నెరవేర్చే శక్తిపీఠాలలో భాగంగా
- 11:09పరిగణించబడతాయి. శక్తిపీఠాలు అంటే సతీదేవి శరీర
- 11:14భాగాలు పడిన ప్రదేశాలనే విషయం తెలిసినది.
- 11:18ఓం శ్రీమాత్రే నమః. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 11:24చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 11:28కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 11:33ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 11:36కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 11:40అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 11:45మీకు తెలిసిన తెలుసుకోదరిచిన విషయాలను క్రింద కామెంట్
- 11:48బాక్స్‌లో తప్పక తెలియజేయండి వీడియో.
- 11:52కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 11:55లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.