Latest / Voice of 'Maheedhar' Planet Leaf / KALKI AVATAR: The Final Chapter of Kaliyuga | Hindu Prophecy Revealed
Transcript
- 0:01సంస్కృతంలో కల్కి అంటే దోషాలను హరించేదని అర్థం.
- 0:06దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టి ఆయనకు కల్కి అని
- 0:10నామకరణం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 0:14కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి
- 0:18లభిస్తుందని శాస్త్ర విధితం. ధర్మపరులను భగవత్బంధువులను
- 0:23హింసిస్తూ ఈ భూమిపై అధర్మం పిచ్చునీరిన వేళ తాను స్వయంగా
- 0:28అవతరించి అధర్మాన్ని నాశనంగావించి ధర్మసంస్థాపన చేస్తానని
- 0:33భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారు.
- 0:38ఈ క్రమంలో మన పురాణాలలో ప్రస్తావించబడిన దశావతారాల
- 0:42గురించి వాటిలో మొదటి మూడు యుగాలలో ఆ నారాయణుడు పూనుకున్న
- 0:46తొమ్మిది అవతారాల గురించి మనం గతంలో చేసిన దశావతారాల వీడియోలో
- 0:51చెప్పుకున్నాం. ఇక ప్రస్తుతం నడుస్తున్న
- 0:54కలియుగంలో పాపం పిచ్చు మీరిపోయినప్పుడు చెడును నాశనం
- 0:58చేసి ధర్మాన్ని పునః స్థాపించడం కోసం ఆయన పదవ అవతారమైన కల్కి
- 1:03భగవానుడిగా అవతరించి కలి ప్రభావం చేత భారంగా తయారైన భూమిని.
- 1:09తడన్న విషయం కూడా తెలిసింది. అలా ఆయన కలియుగాన్ని ముగించి
- 1:14భూమిపై సత్య యుగాన్ని తిరిగి స్థాపిస్తాడని వివరించబడి ఉంది.
- 1:19భాగవతిలోని పన్నెండవ స్కంధంలోని రెండవ అధ్యాయంలో కల్కి భగవానుడి
- 1:24అవతారం గురించి పూర్తి వివరాలు పేర్కొనబడి ఉన్నాయి.
- 1:28అసలు కల్కి అవతార విశేషాలు ఏమిటి? ఆయన మనం ఉంటున్న ఈ భూమిపైకి ఎలా
- 1:33రాబోతున్నాడు? ప్రతి మహాయుధంలోని కలియుగంలో
- 1:36కల్కి అవతరిస్తాడా వంటి సందేహాలన్నింటికీ సమాధానాలు
- 1:40తెలియాలంటే ఈరోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను
- 1:45కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:49వాయిస్ ఆఫ్ మహిత. మన పురాణాల ప్రకారం కృతయుగంలో
- 1:55ధర్మం నాలుగు పాదాలపై హుందాగా నటిస్తే త్రీతా యుగంలో మూడు
- 1:59పాదాలపై ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచినట్లు వివరించబడి
- 2:03ఉంది. ఇక కలియుగంలో ధర్మం కేవలం ఒక్క
- 2:07పాదంపై మాత్రమే నడుస్తున్న విషయం కనిపిస్తూనే ఉంది.
- 2:11అంటే కలి ప్రభావం చేత ఈ యుగంలో దాదాపుగా ధర్మం అంతరించిపోనుందని
- 2:17తెలుస్తోంది. అటువంటి దారుణ పరిస్థితుల నుంచి
- 2:20భూమిని కాపాడి మళ్లీ ధర్మ నాలుగు పాదాలపై నడిచి కృతయుగాన్ని
- 2:25తీసుకురావడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో
- 2:29వస్తాడని వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది.
- 2:34అగ్ని పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ
- 2:38కల్కి భగవానుడి ఆగమన వివరాలు వచ్చిన తరువాత ఆయన చేయబోయే పనులను
- 2:43గురించి పేర్కొనబడి ఉంది. ఇక కల్కి అవతారం గురించి
- 2:47ప్రస్తావించుకుంటే కలియుగంలో దాదాపుగా మనుషులంతా దుర్మార్గులు
- 2:52గానూ, మ్లేక్షులుగానూ మారిపోయి విపరీత ధోరణిలో పాపాలు మిగినీరిన
- 2:57సమయంలో విష్ణుమూర్తి. భూమిపై రహస్యంగా ఉన్న శంభల నగరంలో
- 3:02కల్కిగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాడని, అప్పటి తన అవతారం
- 3:07గురించి తన దేవీరుల జననం గురించి వివరించినట్లు.
- 3:11పురాణంలో ప్రస్తావించబడి ఉంది. అలా స్వామి చెప్పిన విధంగా
- 3:15కలియుగంతంలో హిమాలయాలలో కృతయుగం నుంచి అత్యంత రహస్యంగా ఉన్న శంభల
- 3:21నగరంలో విష్ణు యేశస్సు సుమతీ అనే పుణ్య దంపతులకు జన్మిస్తాడు.
- 3:26ఆయన జన్మించిన సమయంలో నాలుగు చేతులతో సాక్షాత్తు విష్ణు
- 3:30స్వరూపంలోనే కనిపిస్తాడు. అది చూసి తల్లిదండ్రులు
- 3:34కంగారుపడుతుండగా ఆయన తన మాయతో అదంతా ఒక భ్రమలా.
- 3:38మళ్లీ రెండు చేతులతో పుట్టిన సాధారణ పిల్లవాడిలా కనిపిస్తాడని
- 3:43పురాణ ప్రస్తావన. ఆ విధంగా పుట్టిన పిల్ల వాడికి
- 3:46మహర్షులు కలిపి అని నామకరణం చేస్తారు.
- 3:50విష్ణుమూర్తి పదవ అవతారం కోసం ఒక పవిత్రమైన ప్రాంతం ఉండాలని,
- 3:54తలంపుతో దేవశిల్పి అయిన విశ్వకర్మ మన దేశానికి ఉత్తరాన ఉన్న
- 3:59హిమాలయాలలో కలి కూడా కనిపెట్టలేని అత్యంత రహస్య ప్రదేశ.
- 4:04ఎంపల నగరాన్ని నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 4:10గల వారితో పాటు మహిమాన్వితమైన పరికరాలు కూడా ఎన్నో ఉన్నాయని
- 4:15అక్కడికి వెళ్లడం మామూలు మనుషులకు సాధ్యపడదని భారతీయులతోపాటు
- 4:20యూరోపియన్స్ కూడా నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ఆనాడు జర్మన్ నియంత
- 4:25హిట్లర్ ఒక బృందాన్ని శంభల నగరాన్ని వెతకడానికి పంపాడు.
- 4:29ఆ ప్రయత్నం ఫలించకపోగా అలా శంభల నగరాన్ని గురించి వెతకడానికి
- 4:34ప్రయత్నించిన వారిలో చాలామంది చనిపోయారు.
- 4:37విశ్వకర్మచే నిర్మితమైన ఆ అదృశ్య శంభనగరం గురించి అక్కడుండి
- 4:42దివ్యమణికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోల లింక్స్‌ని చూడని
- 4:47వారి కోసం పొందుపరుస్తున్నాను. ఇక కల్కి భగవానుడు జన్మించిన
- 4:52తరువాత ఆయన ఆగమనం గురించి కొంతకాలం ఎవరికీ తెలియకుండా
- 4:56రహస్యంగానే పెరుగుతాడు. విద్యార్థి గురువు కోసం వెతికే
- 5:01సమయంలో మహీంద్రగిరి పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు
- 5:05కనిపిస్తాడు. పరశురాముడు బాలకలికి శిక్షణ ఇచ్చి
- 5:10సకల విద్యలలో తీర్చిదిద్దుతాడు. అలా కల్కి విద్యాభ్యాసం పూర్తయిన
- 5:15తర్వాత పరశురాముడి ఆయన జన్మ రహస్యాన్ని తెలియజేస్తాడు.
- 5:20భూమిని ఉద్ధరించడానికి మానవ రూపంలో ఉన్న తనకు మరిన్ని శక్తులు
- 5:24కావాలని తలచి పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికై తపస్సుకు పూనుకుంటాడు
- 5:29స్వామి. ఆది దంపతులు ప్రత్యక్షమై
- 5:32గరుత్మంతుడి అంశగలిగిన తెల్లటి ఎగిరే గుర్రాన్ని ప్రపంచంలో ఏ
- 5:37శక్తీ ఎదిరించి నిలువలేని ఒక దివ్యఘడ్గాన్ని సర్వజ్ఞుడని ఒక
- 5:42మాట్లాడే చిలుకను ప్రసాదిస్తారు. కల్కి భగవానుడికి ఆ చిలుక కొన్ని
- 5:47దేవతా శక్తులను కలిగి ఉంటుందని పురాణ విధితం.
- 5:51వాటి సహాయంతో కల్కి భగవానుడు. ఈ భూమిపై ధర్మసంస్థాపన
- 5:55గావిస్తాడని ఆశీర్వదిస్తారు. ఆదిదంపతులు ఇదిలా ఉంటే మన
- 6:00భారతదేశానికి దక్షిణాన సముద్ర మధ్యలో ఉన్నతి సింహలి దేశం దానిని
- 6:06నేడు శ్రీలంక అనే పేరుతో పిలుస్తున్నాం.
- 6:09కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకప్పుడు లంక చాలా పెద్దగా
- 6:13ఉండేది. అదంతా కాలగమనంలో వచ్చిన మార్పుల
- 6:17కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది.
- 6:20ప్రస్తుతం మనకు కనిపిస్తున్న శ్రీలంక ఒకప్పటి లంకలో ఒక చిన్న
- 6:25దీవి మాత్రమే. ఈ వివరాలతో కూడా మనం గతంలో చేసిన
- 6:29వీడియో లింక్ ను పొందుపరుస్తున్నాను.
- 6:32శ్రీలంకని కొన్ని సంవత్సరాల ముందు వరకు సింహళ రాజ్యంగా పిలిచేవారు.
- 6:37దాదాపు ఒక దశాబ్దకాలం క్రితమే అక్కడి ప్రభుత్వం తమ దేశానికి
- 6:42శ్రీలంక అని పేరు పెట్టుకున్నది. ఇక లక్ష్మీమాత పద్మావతి అనే
- 6:46పేరుతో ఆ సింహళదేశంలోని బృహద్రధుడు కౌముది అనే
- 6:50రాజదంపతులకు జన్మిస్తుంది. మన పురాణాల ప్రకారం కలియుగం
- 6:55ఏర్పడి చాలా ఏళ్లు గడిచినా భూమిపై నుండి కొన్ని ప్రాంతాలు కొంతమంది
- 7:00మనుషులు మాత్రం కలి ప్రభావానికి లోనవ్వకుండా ఉంటారని ప్రస్తావన.
- 7:05అటువంటి వారి ఈ బృహద్రద్ధుడు కౌముది అనే దంపతులు ఇలా వారికి
- 7:10లక్ష్మీ మాత పద్మావతిగా జన్మించి చిన్నతనం నుంచి నారాయణుడికి భార్య
- 7:15కావాలని తలంపుతో పెరుగుతుంది. మహర్షుల సూచనల మేరకు ఆమె పార్వతీ
- 7:21పరమేశ్వరులకై తపస్సు చేసి తాను కేవలం విష్ణుమూర్తిని మాత్రమే
- 7:25వివాహం చేసుకునేలా కటాక్షించమని వేడుకొని విష్ణువు తప్ప తనను వేరే
- 7:30దృష్టితో చూసిన వారందరూ స్త్రీలుగా మారిపోయేలా వరం
- 7:34పొందుతుంది. ఆ తర్వాత పద్మావతి తల్లిదండ్రులు
- 7:37స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అక్కడికి విచ్చేసిన రాజుల
- 7:42పద్మావతిని చూసి మోహించగానే వారంతా స్త్రీలుగా మారిపోతారు.
- 7:47విష్ణుమూర్తి ఎంతకీ రాకపోవడంతో తనకు ఆదిదంపతులు ప్రసాదించినది
- 7:52వరము శాపమో తెలియక ఆత్మ త్యాగం చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది
- 7:57పద్మావతి. సరిగ్గా అదే సమయానికి అక్కడకు
- 8:01చేరిన సర్వజ్ఞుడని మాట్లాడే చిలుక ఆమెకు విష్ణుమూర్తి యొక్క గల్కీ
- 8:05అవతారం గురించి చెప్పి ఆయన త్వరలోనే వస్తాడని
- 8:09తెలియజేస్తుంది. తరువాత చిలుక కల్కి భగవానుడికి
- 8:13విషయం చెప్పి సింహళ దేశానికి తీసుకువెళుతుంది.
- 8:16కల్కి భగవానుడు పద్మావతిని చూసిన తర్వాత కూడా స్త్రీ రూపంలోకి
- 8:21మారకపోవడంతో వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే అని
- 8:25తెలుసుకొని కల్కిని పెళ్లి చేసుకుంటుంది.
- 8:28కల్కి భగవానుడి రాక కలియుగాంతంలో ఉంటే అప్పటికి ఇప్పుడున్న
- 8:32టెక్నాలజీ కన్నా అత్యాధునిక టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది.
- 8:37ఆ సమయంలో ఈ గుర్రాలు, కత్తులు, రాజవంశాలు అనేవి ఉంటాయి అనే
- 8:42సందేహం కలగడం సహజం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం
- 8:46ఏటేంటి? రామాయణ, మహాభారతాలలో వాడిన చాలా
- 8:50అస్త్రాల పేర్లు సాధారణంగా వినిపించిన వాటి వెనుక ఎంతో
- 8:54సైన్స్ దాగి ఉందని, ఈ మధ్య పరిశోధనలలో బయటపడుతోంది.
- 8:59అలాగే కల్కి భగవానుడి అవతారం గురించిన వర్ణన ఎప్పుడో కొన్ని
- 9:03యుగాలకు పూర్వమే రాయబడింది. ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలు,
- 9:08వాహనాల పేర్లు ఏవైనా వాటికి ఉండే శక్తుల వర్ణనలో గమనిస్తే అవి
- 9:13అడ్వాన్స్ వెపన్స్‌గా అర్థమవుతుంది.
- 9:16అలాగే రాజవంశాల విషయంలోనూ మనకు తెలిసిన గత 5000 సంవత్సరాల
- 9:22చరిత్రలోని ఎన్నో మార్పులను చూశాము.
- 9:25ఇక కల్కీ అవతారం కలియుగా అంతంలో జరుగుతుందని మన పురాణాలలో
- 9:29పేర్కొనబడి ఉంది. కలియుగ కాల పరిమితి 4,32,000
- 9:34సంవత్సరాలు. అందులో ఇప్పటి వరకు ఇంచుమించు
- 9:385000 ఏళ్లు మాత్రమే గడిచాయి. అంటే ఇంకా 4,27,000 సంవత్సరాల
- 9:45సమయం మిగిలి ఉంది. అప్పటికి మన భూమి పరిస్థితులు ఎలా
- 9:49ఉంటాయో చెప్పడం ఎవరి తరమూ కాదు. ఇక కల్కి భగవానుడి రాకకు కారణమైన
- 9:55ధర్మ స్థాపన విషయానికి వస్తే విష్ణుమూర్తి ఒక్కో అవతారం
- 10:00ఎత్తినప్పుడల్లా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, రావణుడు,
- 10:03కుంభకర్ణుడి వంటి రాక్షసులను చంపడం తెలిసింది.
- 10:07భాగవతం ప్రకారం వారంతా వైకుంఠంలోని విష్ణుమూర్తి
- 10:11నివాసానికి, ద్వారపాలకులుగా ఉన్న జై విజయులుసనకాది మునుల శాపం
- 10:16కారణంగా వివిధ జన్మలలో రాక్షసుడుగా పుట్టి విష్ణుమూర్తి
- 10:20చేతిలో వారు మరణించారు. కల్కిపురాణం ప్రకారం కలియుగంలో జై
- 10:25విజయలు రాక్షసులుగా కాకుండా ఆ స్వామికి కొడుకులుగా పుడతారని
- 10:30చెప్పబడి ఉంది. పైగా వారిద్దరి కారణంగానే కల్కి
- 10:34భగవానుడి అవతారంలో ఆయన చేయాల్సిన ధర్మసంస్థాపనకు నాంది పడుతుందని
- 10:39కూడా పేర్కొనబడి ఉంది. అదెలా అంటే సింహళ దేశ రాజదంపతులైన
- 10:44బృహద్రధుడు, కౌముదిల పుత్రిక పద్మావతిని కల్కిభగవానుడు,
- 10:48వివాహమాడటం వంటి విషయాలు ముందు చెప్పుకున్నాము.
- 10:52ఆ తర్వాత స్వామి, అమ్మవారిని తీసుకుని శంభల నగరానికి
- 10:56వెళ్లిపోతారు. అక్కడ వారికి ఇద్దరు కుమారులు
- 10:59పుట్టగా వారికి జయవిజయలనే పేర్లు పెడతారు.
- 11:03వారిద్దరూ శంభల నగరంలోని పెరిగి పెద్దమ్మడంతో పాటు సకల విద్యలలోనూ
- 11:08ప్రావీణ్యం పొందుతారు. అలా వారి విద్యాభ్యాసం పూర్తయిన
- 11:13తర్వాత ఒకనాడు జై విధులు కలిసి భగవానుడిని చేరి గత యుగాలలో
- 11:17శ్రీరాముల వారు ధర్మరాజు చేసినట్లు అశ్వమేధ యాగం చేయమని
- 11:22కొరతారు. తన అవతార ధర్మం నెరవేర్చే సమయం
- 11:26ఆసన్నమైందని అర్థమైన స్వామి సెంపల నగరం నుంచి అశ్వమేధ యాగాన్ని
- 11:31మొదలు పెడతాడు. ఇక్కడ కల్కి భగవానుడు
- 11:34విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ మానవ రూపంలో భూమిపై జన్మించడం వలన
- 11:39చేయనున్నది కఠినమైన రణం కావడం తో మరింత మద్దతు కోసం ఆయన
- 11:44స్వామీధయ్యాగానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
- 11:48ఈ క్రమంలో ఆయన అప్పటికలి ప్రభావం వల్ల పీడింపబడని నగరాలకు ముందుగా
- 11:53వెళ్లి అశ్వమేధ యాగం కోసం అక్కడి రాజుల మద్దతు కూడబెట్టుకుని వారి
- 11:58సైన్యాలను కూడా తన సైన్యంలో కలుపుకుంటాడు.
- 12:02ఆ తర్వాత కల్కి భగవానుడు విశాలమైన సైన్యంతో ముందుగా కలి ప్రభావం చేత
- 12:07పూర్తిగా నాశనమైన కీటకపురం అనే రాజ్యానికి వెళ్తాడని పురాణ
- 12:11విధితం. అక్కడి రాజు ప్రభుత్వం, ప్రజలు
- 12:15కలి ప్రభావం చేత అమాయకులను హింసిస్తూ పరమ దుర్మార్గాలను
- 12:19అనుసరిస్తూ ధర్మాన్ని పూర్తిగా విడిచి విశృంఖల జీవితాలను గడుపుతూ
- 12:24గోమాంసాన్ని భుజిస్తూ ఉంటారు. అటువంటి రాజ్యంపై కల్కి భగవానుడు
- 12:29ముందుగా దాడి చేయగా అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుందని, ఆ
- 12:34యుద్ధంలో కీటక రాజైన గినుడు అతడి తమ్ముడైన శుద్ధోదనుడు కలిసి కల్కి
- 12:39భగవానుడితో యుద్ధం చేస్తారని తెలుస్తోంది.
- 12:43ఆ యుద్ధంలో కల్కి భగవానుడు జీనుడి మర్మాంగాలను నరికేయగా అతడు
- 12:48చనిపోతాడు. ఆ తరువాత శుద్ధోధనుడి తల నరికి
- 12:52చంపుతాడు. వారిద్దరి మరణం తరువాత
- 12:55శుద్ధోధనుడి భార్య అయిన మాయ కూడా స్వయంగా యుద్ధరంగంలోకి రాగా
- 13:00కల్కిలో ఉన్న విష్ణుమాయ ఆమెను లీనం చేసుకుంటుంది.
- 13:04దాంతో ఆ యుద్ధం ముగిసి అక్కడ ధర్మసంస్థాపన జరుగుతుందని
- 13:09తెలుస్తోంది. కల్కి సాధించిన తొలి విజయం
- 13:12తర్వాత సప్త చిరంజీవిలలో ఒకటైన అశ్వద్ధామ వచ్చి ఆ స్వామిసేనకు
- 13:17శిక్షణ ఇస్తాడని పురాణ విధితం. వివిధ యుగాలలో జన్మించి సప్త
- 13:23చిరంజీవిలుగా కలియుగాంతం వరకు కొనసాగుతున్న వారంతా ధర్మసంస్థాపన
- 13:27కోసం కల్కి భగవానుడు చేసే యుద్ధంలో పాలు పంచుకోవడం కోసమే
- 13:32రహస్యంగా జీవిస్తున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.
- 13:36అలా సిద్ధమైన సైన్యంతో కల్కి భగవానుడు.
- 13:39మన భారతదేశంతో పాటు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉన్న మ్లీచులు,
- 13:44కిరాతలు, అధర్ములందరినీ సంహరిస్తాడు.
- 13:48ప్రపంచవ్యాప్తంగా మిగిలిన అధర్మ వర్తన రాజులంతా కలిసి కోకావి కోక
- 13:53అనబడే రాజుల దగ్గరకు చేరి కలిపురుషుడితో సమావేశమై కల్కి
- 13:57భగవానుడిని ఓడించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు.
- 14:03విషయం తెలుసుకున్న జగన్ నాటక సూత్రధారి తదనుగుణంగా వారిపై
- 14:07యుద్ధం చేసి అధర్మ పరులందరినీ సంహరిస్తాడు.
- 14:11చివరకు స్వామి చేతిలో చావు దెబ్బలు తిన్న కలిపురుషుడు ఒక
- 14:14గాడిద పై ఎక్కి పారిపోతాడు. అలా కలియుగం అంతమై తిరిగి సత్య
- 14:19యుగం మొదలవుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
- 14:24యుద్ధంలో దెబ్బతిని పారిపోయిన కలి మరో మహాయుగంలో మళ్ళీ వచ్చే
- 14:28కలియుగం సమయానికి కోలుకుని మళ్లీ తన ప్రభావాన్ని చూపించడం కాలచక్ర
- 14:33ప్రభావం. ఇక కల్కి భగవానుడు.
- 14:36తిరిగి తన సైన్యంతో శంభాలకు చేరి అక్కడే దాదాపు వెయ్యేళ్లపాటు
- 14:41రాజ్యపాలన చేస్తాడు. ఆ క్రమంలో కల్కి భగవానుడు భూమాత
- 14:45అవతారమైన రమా అనే రాజకన్యను కూడా వివాహం చేసుకుంటాడు.
- 14:50అప్పటి వరకు రహస్యంగా ఉన్న సింబల్ నగరం అక్కడి నుంచి సాధారణ ప్రజలకు
- 14:55కూడా కనిపిస్తుంది. కలిపురుషుడు పారిపోవడం
- 14:59కల్కిభగవానుడు. ఆఖరి అధర్ముడిని కూడా సంహరించడం
- 15:02మనుషులందరినీ తిరిగి పూర్తి ధర్మమార్గంలోకి తీసుకురావడంతో
- 15:07కాలచక్రం తిరిగి తరువాతి మహాయుగంలో మరో సఖ్య యుగం
- 15:11మొదలవుతుంది. వెయ్యేళ్ల పాలన తర్వాత స్వామి
- 15:15అవతారం చాలించి దేవేరుల సమేతంగా తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని
- 15:20పురాణాలు చెబుతున్నాయి. ఇక ప్రతి మహాయుగంలోని కలియుగంలోనూ
- 15:25కల్కి భగవానుడు అవతరిస్తాడా అని ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి.
- 15:31కొన్ని కలియుగాలలో విభిన్న రూపాలలో వస్తాడని మహాభారత మత్స్య
- 15:35స్కంధ పురాణాలలో పేర్కొనబడి ఉంది. ఒక కలియుగాని పరశురాముడు
- 15:40ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా
- 15:46వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దీని భాగవతం చెబుతోంది.
- 15:52ధర్మరక్షతి రక్షితః. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 15:57చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 16:01కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:06ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 16:09కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 16:13అలాగే వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 16:17మీకు తెలిసిన తెలుసుకోదరిచిన విషయాలను క్రింద కామెంట్
- 16:21బాక్స్‌లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 16:25పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:29ఆశిస్తున్నాను.