Latest / Voice of 'Maheedhar' Planet Leaf / MANIKANTHA: Unknown Truths | Unbelievable Facts About Sabarimala Ayyappa | మణికంఠుడు
Transcript
- 0:01స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండలం రోజుల పాటు నిష్టగా స్వామి
- 0:06మాల ధరించి హరిహర సూతుడి కై ఆర్థిక భజనలు చేస్తారు.
- 0:10అయ్యప్ప భక్తులు ఆ మణికంఠుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా
- 0:15ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో నిష్టతో కూడుకున్న అయ్యప్ప
- 0:20మాలను ధరించి మండలం రోజులపాటు తూచా తప్పకుండా నియమ నిబంధనలు
- 0:25పాటించడం. మండలం పూర్తయ్యాక శబరిమలకు వెళ్లి
- 0:28దీక్ష విరమించడం వంటివి చూస్తూ ఉంటాము.
- 0:32మరీ ముఖ్యంగా కాత్తీక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా అయ్యప్ప
- 0:36మాల ధరించిన స్వాములు మన చుట్టూ ఎంతోమంది మనకు కనిపిస్తుంటారు.
- 0:41స్వాములు చేసి భజనలలోను ప్రవచించే గాధలను వింటుంటే అసలు అయ్యప్ప
- 0:46స్వామి ఎవరు, ఆయన ఎప్పుడు ఎలా జన్మించారు, ఎక్కడ వెలిశారు వంటి
- 0:51సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి.
- 0:54ఇప్పుడున్న ఆలయం ఎవరు ఎప్పుడు గట్టారు?
- 0:57ఆ క్షేత్ర విశేషాలు ఏమిటి? అసలు అయ్యప్పస్వానికి
- 1:01ప్రీతిపాత్రమైన నలుపు రంగు వస్త్రాలు ధరించడానికి కారణం
- 1:05ఏమిటి? వంటి విషయాలు మనలో చాలామందికి
- 1:08తెలియదు. ఈ ఆలయంలోని మూలవిరాట్‌కు
- 1:11సంబంధించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం
- 1:15పొందుపరుస్తున్నాను. ఇక క్షేత్ర విశేషాలు
- 1:18తెలుసుకోవడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా జూసి మీ
- 1:22అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:27వాయిస్ ఆఫ్ మహీధర్. క్షీరసాగర మధ్యన అనంతరం దేవతలకు,
- 1:33రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించిన
- 1:37విషయం తెలిసిందే. ఆ తరువాత మోహినిని చూసి గరిళ్ల
- 1:42కంఠుడు ఆకర్షింపబడడం వారి కలయిక వలన శివకేశవుల తేజస్సుతో
- 1:46ధనుర్మాసం 30 వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరానక్షత్రం
- 1:51వృశ్చికలజ్ఞంలో అయ్యప్ప జన్మించాడు.
- 1:55ఆ తర్వాత తండ్రి అయిన జగత్పిత ఆజ్ఞ మేరకు పంపా సరోవర
- 1:59తీరప్రాంతంలో కంఠంలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు స్వామి.
- 2:05ఆ సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వచ్చిన పందల
- 2:09తీశాధీసుడు గొప్ప శివ భక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక
- 2:14అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును
- 2:18ప్రసాదించాడని తలచి ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి
- 2:22తీసుకువెళ్లాడు. మణికంఠుని సాత్విక గుణాల వల్ల
- 2:26కొందరు అయ్యా అని మరికొందరు అబ్బాని, ఇంకొందరు రెండు పేర్లు
- 2:30కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు
- 2:35అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకున్నాడు.
- 2:40కానీ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని తనకు ఒక ఆలయం నిర్మించి
- 2:44ఇవ్వమని కోరాడు. మణికంఠుడు అందుకు నియమం ఏమిటంటే
- 2:49తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం
- 2:54నిర్మించాలని చెప్పాడు. అలా కట్టిన ఆలయమే శబరిమల ఆలయం,
- 3:00శబరిమల ఆలయ నిర్మాణంలో పరశురాముడు కీలకపాత్ర పోషించారు.
- 3:05అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తుల
- 3:09పూజలందుకుంటున్నాడని చరిత్ర విధిద్దాం.
- 3:12అధికారిక సమాచారం ప్రకారం మొదటిలో శబరిమలకు వెళ్లడానికి ఎరుమేలి అని
- 3:17పిలువబడే ఒకే ఒక్క మార్గం ఉండేది. మాసపూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ
- 3:23సిబ్బంది, తాంత్రి మేల్, శాంతి వంటి వారెవరైనా ఈ మార్గంలోనే
- 3:27వెళ్లి వచ్చేవారు పూర్తిగా అడవి ప్రాంతం కావడం చేత ఆలయానికి
- 3:32ఎప్పుడు ఎవరు వెళ్లాలన్నా బృందాలుగా మాత్రమే వెళ్లేవారు.
- 3:37అందుకే భక్తులు కూడా జట్లుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
- 3:42సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819 లో 70 మంది శబరిమల యాత్ర
- 3:49చేశారని, ఆ సంవత్సరం అన్ని ఖర్చులు పోను ఆలయానికి వచ్చిన
- 3:53ఆదాయం ఏడు రూపాయలని పందళ్ల రాజవంశీయుల రికార్డులలో
- 3:58ప్రస్తావించబడింది. 1900 ఏడవ సంవత్సరం వరకు శబరిమల అయ్యప్ప ఆలయ
- 4:04పైకప్పు కేవలం ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది.
- 4:09అక్కడి స్వామి శిలా విగ్రహానికి పూజలు జరిగేవి.
- 4:12కొన్ని దశాబ్దాల క్రితం దేవాలయం అగ్నిప్రమాదానికి గురికావడంతో మరల
- 4:17ఆలయాన్ని పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.
- 4:21ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో
- 4:25తయారుచేయించి ప్రతిష్టించారు. పంచలోహ విగ్రహం ప్రతిష్టించాకి
- 4:30శబరిమల వైభవం పెరిగిందని, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
- 4:35ఈ దేవాలయం 1935 వరకు ట్రావెన్కోర్ మహారాజా సంస్థానం వారి ఆధీనంలో
- 4:41ఉండేది. 1935 లో ఆలయ బాధ్యతలు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు
- 4:47వారికి అప్పగించబడ్డాయి. ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా
- 4:52పెరగడంతో జ్యోతి దర్శనానికి కాకుండా మండల పూజలకు కూడా శబరిమల
- 4:57ఆలయం తెరవడం మొదలుపెట్టారు. పంబా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో
- 5:02చాలక్కాయ మార్గం వడిపిరియార్ మార్గం ఏర్పడిన తరువాత శబరిమలకు
- 5:06వచ్చే భక్తుల తాకిడి బాగా పెరిగింది. 1945 వ సంవత్సరం నుండి
- 5:12భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విశు పంకుని ఉత్తరం ఓనం వంటి పండుగ
- 5:18దినాలలో కూడా ఆలయాన్ని తెరవడం. శబరిమలకు వచ్చే భక్తులు
- 5:23పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కొట్టి 1900 యాభైలో దేవాలయాన్ని,
- 5:29విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం
- 5:34మూడుసార్లు అగ్నికి ఆహుతి అయ్యింది.
- 5:37భక్తుల విరాళాలతో దేవస్థానం బోర్డు వారు ఇప్పుడున్న ఆలయాన్ని
- 5:41పునర్నిర్మించి ఇప్పుడు మనకు కనిపించే స్వామివారి పంచలోహ
- 5:45విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని చెంగనూరు
- 5:49వాస్తవ్యులైన శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠ నని శిల్పులు తయారు
- 5:53చేసినట్లు తెలుస్తోంది. దేవస్థాన ముఖ్య తాంత్రి అయిన
- 5:58శ్రీకాంతారు, శంకర తాంత్రి 1951 జూన్ ఏడవ తేదీన వేదపండితుల
- 6:04మంత్రాలు, భక్తుల శరణ ఘోషల మధ్య ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
- 6:09అప్పటివరకు కేరళీ కేళి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప అక్కడి
- 6:14నుంచి భారత కేళి విగ్రహంగా కీర్తించబడుతూ ఈనాడు భూతళ కేళి
- 6:18విగ్రహంగా ప్రపంచమంతటా పూజింపబడుతున్నాడు.
- 6:22ఈ విషయంలో శబరిమల తపస్వి శ్రీ విమోచననంద స్వామి కృషి ఎంతో
- 6:27మెచ్చుకోదగ్గెది 1950 లో శబరిమలలోని అయ్యప్ప ఆలయం అగ్నికి
- 6:33ఆహుతైనప్పుడు శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తూ
- 6:37బదరీనాథ్ లో ఉన్నప్పుడు ఈ వార్త విన్నారు.
- 6:41శబరిమల ఆలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి భారతదేశం అంతటా అయ్యప్ప
- 6:46ఆలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా స్వామిని
- 6:49కీర్తించేటట్లు చేస్తానని శపథం చేశారాయన.
- 6:54ఆ మహానుభావుడు కాశీ హరిద్వార్ పూన ముంబై, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం
- 6:59మొదలైన ప్రాంతాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మింపజేయడానికి దోహదపడ్డారు.
- 7:05ఆయన కోరిక నెరవేరి దేశం అంతటా ఎన్నో అయ్యప్ప ఆలయాలు
- 7:09నిర్మితమవ్వడమే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు
- 7:14వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా 1980 కి వచ్చేసరికి
- 7:20శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగిపోవడంతో దేవస్థానం
- 7:25బోర్డు వారు శ్రద్ధ తీసుకుని పంబ పై వంతెన పంబ నుండి విద్యుత్
- 7:29దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద
- 7:33పెద్ద షెడ్లు నిర్మించినట్లు. ఆలయ రికార్డు పేర్కొంటున్నాయి.
- 7:38ఇక శబరిమల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పదునెట్టాంబడిగా
- 7:43పిలువబడే 18 బంగారం ఎట్లు అయ్యప్ప స్వామి సన్నిధానంలోని
- 7:48పదునెట్టాంబడిని స్వయంగా పరశురాముడి నిర్మించారు.
- 7:52ఆ రాతిమెట్లపైనే 1984 వరకు భక్తులు ఎక్కేవారు.
- 7:58ఈ మెట్లను తాకడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు
- 8:02విశ్వసిస్తారు. స్వాములు వెళ్లే పడిని బట్టి ఆ
- 8:05మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కి ఆచారం ఉండేది.
- 8:10అందువల్ల మెట్లు కొంత మేర అరిగిపోయాయి.
- 8:13పైగా అలా మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన ఆ ముక్కలు కాళ్లకు
- 8:17గుచ్చుకుని భక్తులు ఇబ్బంది పడేవారు.
- 8:20దానితో 1980 ఐదులో భక్తుల విరాళాలతో ఆ 18 మెట్లకు పంచలోహ
- 8:26కవచాన్ని మంత్రసహితంగా కప్పివేశారు.
- 8:30దీని వల్లన 18 మెట్లు ఎక్కడ స్వాములకు సులభతరమైంది.
- 8:35దీనికి ముందు భక్తుల రద్దీ పెరగడం వల్లన తొక్కిసలాటలు లేకుండా
- 8:39ఉండటానికి వీలుగా 1982 లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి
- 8:44దానిపైనుండి 18 మెట్లు ఎక్కిన తర్వాత క్యూలో వెళ్లడానికి
- 8:48ఏర్పాట్లు చేశారు. 1985 నుండి అక్కడ స్థిర నిర్మాణాలు ఎన్నో
- 8:54చేయడం వలన శబరిమల స్వరూపం పూర్తిగా మారిపోయింది.
- 8:59బెంగళూరుకు చెందిన భక్తుడొకరు శబరిమల ఆలయంపై బంగారు రేకులతో
- 9:03తాపడం చేయడానికి పూనుకుని రెండువేల వ సంవత్సరంలో
- 9:07పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదీవాలయంగా మారింది.
- 9:12శబరిమల ఆలయంలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రిలేక తంత్రి అని
- 9:17పిలుస్తారు. పరశురాముడు వీరిని పూజ కొరకు,
- 9:21ఆంధ్ర, కృష్ణా జిల్లా నుండి తీసుకెళ్లారని చెబుతారు.
- 9:25ప్రస్తుతం శ్రీ రాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో
- 9:29పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు
- 9:33జరిపించడానికి మీల్ శాంతిగా పిలువబడే పూజారిని ప్రతి సంవత్సరం
- 9:38లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానం వారికి వచ్చిన
- 9:42దరఖాస్తులను పరిశీలించిన తర్వాత వాటిలో పదింటిని ఎంపిక చేసి ఆ
- 9:47పేర్లను చీటీలపై రాసి ఒక డబ్బాలో ఉంచుతారు.
- 9:51దానిని అయ్యప్ప విగ్రహం ముందు నుంచి ఒక చిన్న పిల్లవాని చేత
- 9:55లాటరీ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారు ఆ
- 9:59సంవత్సరానికి శబరిమలలో మేల్శాంతిగా వ్యవహరిస్తారు.
- 10:04ఇక స్వామి వారి ఆభరణాలను పందెలలో భద్రపరచి ఉంచుతారు.
- 10:09ప్రతి ఏటా జనవరి 14 వ తారీఖునాటికి అంటే మకర సంక్రాంతి
- 10:13రోజున పందేల నుంచి శబరిమలకు మూడు పెట్టెలలో 84 కిలోమీటర్ల అడవి
- 10:19మార్గంలో నడుచుకుంటూ మోసుకు వస్తారు.
- 10:22ఈ ఆభరణాలు తేవడానికి పందిలంలోని భాస్కరన్ పిళ్లై వారి కుటుంబం
- 10:27బాధ్యత వహిస్తుంది. వీరు మొత్తం 11 మంది వారంతా 65
- 10:33రోజులు దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమలకు తీసుకు
- 10:37వస్తారు. వీరు జనవరి 12 మద్యాహ్నం పందెం
- 10:41నుండి బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని 14 వ
- 10:46తేదీ సాయంత్రం 6:00 శబరిమల సన్నిధానం చేరతారు.
- 10:50ఆభరణాల వెంట పందల రాజవంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల
- 10:55వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి
- 11:00అలంకరించి కర్పూరాహారతిగుళ్ళో ఇవ్వగానే తూర్పుదిక్కు
- 11:04పొన్నాంబళమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది.
- 11:08ఇరుముడి లేకుండా తాంత్రి పందల రాజు తిరు ఆభరణాలు మోసేవారు 18
- 11:14మెట్లు ఎక్కుతారు. మరల జనవరి 20 వ తారీఖునాడు పందల
- 11:18రాజు వంట రాగా, తిరు ఆభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం
- 11:23తీసుకువెళ్లి భద్రపరుస్తారు. ఇలా ప్రతి ఏటా స్వామివారి ఆభరణాలు
- 11:28తరలిస్తున్న సమయంలో వాటికి రక్షణగా ఆకాశంలో ఒక గరుడ పక్షి
- 11:32తిరుగుతుండడం, స్వామివారి లీలగా భక్తులు భావిస్తారు.
- 11:37ఇక అయ్యప్ప మాలధారణ చేసిన 40 ఒక్క రోజుల పాటు నల్లటి వస్త్రాలు
- 11:42ధరించడానికి కారణం విషయానికి వస్తే.
- 11:45నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా సినీ
- 11:50రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదల రాకుండా సదా కాపాడే
- 11:55మహిమాన్వితమైన దైవం అయ్యప్పస్వామి అయ్యప్ప భక్తులపై తన ప్రభావం
- 12:00చూపించనని సినీ భగవానుడు అయ్యప్పకు వాగ్దానం చేశాడు.
- 12:05అందుకే శని కి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షా
- 12:09కాలంలో ధరించాలని అయ్యప్ప మానవులకు నియమం పెట్టాడు.
- 12:13దీక్ష సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి
- 12:17జీవితాంతం సినీ ప్రభావం ఉండదని అయ్యప్ప స్వాముల నమ్మకం.
- 12:23స్వామి శరణమయ్యప్ప. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 12:28చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 12:32కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 12:37ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 12:40కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 12:44అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 12:48మీకు తెలిసిన తెలుసుకోదలిసిన విషయాలను క్రింద కామెంట్
- 12:52బాక్స్‌లో తప్పక తెలియజేయండి వీడియో.
- 12:55కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 12:58లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.