Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Amazing Facts about Sri Chengalamma Parameshwari Temple! త్రికళే చెంగళి శక్తి
Transcript
- 0:01ఈ అనంత విశ్వం యొక్క మనుగడ శక్తి అనే మూల స్తంభంపైనే ఆధారపడి ఉందని
- 0:06మానవుని నమ్మకం. అయితే ఈ శక్తి ఎక్కడ నుంచి ఏ
- 0:10విధంగా ఉత్పన్నమవుతుందో నేటి సైన్స్ కి అంతుచిక్కని ఓ ప్రశ్నగా
- 0:14మిగిలిన పలు పురాతన నాగరికతలు మాత్రం ఆసక్తికి ఒక అర్థాన్ని
- 0:19చెప్పే ప్రయత్నం చేసే అటువంటి నాగరికతలలో నేటికీ భూమిపై మనుగడ
- 0:24సాగిస్తున్న ఏకైక నాగరికత మన సనాతన ధర్మం.
- 0:28ధర్మంలో సృష్టిని నిలబెట్టే ఆసక్తిని ఆదిపరాశక్తిగా పేర్కొనడం
- 0:33జరిగినట్లు మన వేదాలు ఇతిహాసాలు వెల్లడిస్తాయి.
- 0:37అంతేకాదు ఆ శక్తికి వివిధ గుణాలున్నాయని గ్రహించిన కొంతమంది
- 0:41మహాపురుషులు ఒక్కో గుణానికి ఒక్కో విధమైన పేరును ఇవ్వడం జరిగినట్లు
- 0:46మన పురాణాలు చెబుతున్నాయి. కారణంగానే మన అఖండ భారతావని
- 0:50మొత్తం అష్టాదశ క్షేత్రాలు, శక్తిపీఠాలు, ఆలయాలు వెలిశాయి.
- 0:55వాటన్నింటిని తదేకంగా పరిశీలిస్తే అక్కడ ఎన్నో వింతలు నేటికీ
- 1:00అంతుచిక్కని ఆశ్చర్యకర విషయాలు మనకు దర్శనమిస్తాయి.
- 1:04నేడు ఈ క్షేత్రాలలో చాలా వాటి గురించి మనకు తెలిసిన నేటికీ మనలో
- 1:09చాలామందికి తెలియని ఆలయాలు. వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయని
- 1:14చెప్పవచ్చు. అటువంటి వాటిలో ఒక ఆలయం మన తెలుగు
- 1:18రాష్ట్రం లోనే ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి మెడలో నిత్యం
- 1:22కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఉన్న నేటికీ ఆ గుడికి తలుపులు
- 1:27లేవు. ఇక రాత్రి వేళలో ఈనాటికీ ఏ ఒక్కరూ
- 1:30ఆ గుడిలోకి ఒంటరిగా వెళ్లి సాహసం కూడా చేయలేరంటున్నారు.
- 1:34ఇన్ని వింతలు, విశేషాలు కలిగిన. ఎక్కడుంది?
- 1:39అక్కడి అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తారో.
- 1:42అసలు అక్కడ జరిగే వింతల వెనుక ఉన్న కారణాలేమిటి?
- 1:45అసలు ఆలయ స్థల పురాణం ఏం చెబుతోంది అనే విషయాలు పూర్తిగా
- 1:50తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి.
- 1:54వాయిస్ ఆఫ్ మహీధర్. మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉండగా
- 1:59వాటిలో అనేక పురాతన ఆలయాల్లోని దేవతా మూర్తులు అన్ని స్వయంభూలే
- 2:04నని, ఆయా క్షేత్రాలలో ఉన్న అనేక ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది.
- 2:09మరి ముఖ్యంగా శక్తి స్వరూపంగా భావించే అమ్మవార్ల ఆలయాల
- 2:13విషయానికొస్తే మనలో చాలామంది అష్టాదశ శక్తి పీఠాలలో కొలువైన
- 2:18శక్తి స్వరూపాలనే కాకుండా వారికి ప్రతిరూపాలు.
- 2:22లేదా ఉపశక్తులుగా భావించే అమ్మవార్లను గ్రామదేవతలుగా
- 2:26అనాదిగా కొలుస్తున్నాం. అటువంటి గ్రామదేవతలలో ఒకరే మన
- 2:30ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట అనే
- 2:33గ్రామంలో కొలువైన చెంగలమ్మ పరమేశ్వరి మాత ఈ ఆలయంలో ఉండే
- 2:38వింతలు, విశేషాల గురించి తెలుసుకోవాలంటే.
- 2:41క్షేత్ర పురాణం గురించి ముందుగా తెలుసుకోవాలని ఆలయ పెద్దలు
- 2:45చెబుతున్నారు. ఇప్పుడు సూళ్లూరుపేటగా
- 2:47పిలువబడుతున్న ఆ గ్రామాన్ని దాదాపు 600 సంవత్సరాల క్రితం
- 2:52శుభగిరి అని పిలిచేవారు. అయితే ఆ ఊరికి అతి సమీపంలో
- 2:56కాళింది అనే నది ఉండటం ఆ నదిలో సుడిగుండాలు ఎక్కువగా ఏర్పడటం
- 3:01వల్ల కాలగమనంలో ఆ గ్రామానికి సూళ్లూరుపేట అనే పేరు వచ్చిందని,
- 3:05ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదు.
- 3:08బెంగాలమ్మ గుడిలో నేటికి ప్రతి సంవత్సరం సుడిమాను అనే ఉత్సవం
- 3:12నిర్వహిస్తుంటారు. అందువల్లనే ఆ గ్రామానికి
- 3:15సూళ్లూరుపేట అని పేరు వచ్చినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
- 3:20ఇక పూర్వం శుభగిరిలో ఉండే ప్రజలలో చాలా వరకు పాడిపంటలపైనే ఆధారపడి
- 3:25జీవించేవారని చెబుతారు. అందువల్ల ఆ గ్రామంలో ఉండే
- 3:28పెద్దవాళ్ళు దాదాపు ఉదయం వేళలో పంటపొలాల్లో పనికి వెళితే
- 3:33కుర్రవాళ్లు మాత్రం పశువులకు కాపలాగా తిరిగేవారు.
- 3:37ఒక రోజు పశువులను కాల్చే కొంతమంది కుర్రవాళ్ళు స్నానం చేయడానికి ఆ
- 3:41కాళింది. నదిలో దిగడం జరిగింది.
- 3:43అయితే వారిలో ఒక్క అబ్బాయి మాత్రం ఆ నదిలో వచ్చిన ఒక సుడిగుండంలో
- 3:48చిక్కుకుపోయి నీటిలో మునిగిపోతున్న సమయంలో ఏదో ఒక
- 3:51బలమైన వస్తువు ఆ కుర్రవాడి చేతికి చిక్కడం జరిగింది.
- 3:55దాంతో అతడు ఆ వస్తువుని బలంగా పట్టుకోగా కొంత సేపటికి ఆ
- 3:59సుడిగుండం వీగిపోయి అక్కడి నీరు ప్రశాంతంగా బారడం మొదలుపెట్టింది.
- 4:04అది గమనించిన ఆ కుర్రవాడు మెల్లగా ఒడ్డుకు చేరుకుని అక్కడ జరిగిన
- 4:08విషయాన్ని మొత్తం తన స్నేహితులకు చెప్పాడు.
- 4:11దాంతో వారంతా కలిసి నదిలో దాగున్న ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామని
- 4:16కుతూహలంతో విశ్వ ప్రయత్నాలు చేసి నదిలో ఆ వస్తువుని అతి కష్టం మీద
- 4:21బయటకు తీశాం. తీరా చూస్తే.
- 4:23దాదాపు ఎనిమిది చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం పట్టుకుని ఒక
- 4:27కాలితో రాక్షసుడిని తొక్కిపట్టి ఉంచిన పెద్ద అమ్మవారి విగ్రహమని,
- 4:32ఆ కుర్రవాళ్లు గ్రహించి భయంతో ఆ విగ్రహాన్ని అక్కడే నేలపై పడేసి
- 4:37ఊరికి పరుగులంకించారు. అలా వెళ్లిన పిల్లలు వారు చూసిన
- 4:40విషయం గురించి ఊరిలో వారందరికీ చెప్పగా అప్పటికి చీకటి పడడంతో
- 4:45ఉదయాన్నే వెళ్లి అదేంటో పరీక్షిద్దామని పెద్దలందరూ
- 4:48తీర్మానించుకున్నారు. అయితే.
- 4:51ఆ రోజు రాత్రి. పెద్ద కలలో ఒక స్త్రీ నేను ఎక్కడ
- 4:54ఉన్నానో అలాగే ఉందని నన్ను కదప వద్దు.
- 4:57అక్కడ నుంచి పంపించవద్దు అని చెప్పిందట.
- 5:00కానీ ఆ ఊరి పెద్ద కి ఉదయం లేచిన తర్వాత ఆ కల గుర్తుకు లేకపోవడంతో
- 5:05ఆ స్వప్నం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఊరిలోని తక్కిన
- 5:09వారితో కలిసి కాళింది. నది ఒడ్డుకు వెళ్లాడు.
- 5:12అక్కడ పెద్ద అమ్మవారి విగ్రహం దక్షిణ దిక్కుగా నిలబడి ఉండటం
- 5:16గమనించి ముందు రోజు ఆవిగ్రహాన్ని నదిలోంచి బయటకు తీసిన కుర్రవాళ్లు
- 5:20ఆశ్చర్యపోయారు. తాము.
- 5:22ఆ విగ్రహాన్ని క్రింద పడేసి వచ్చామని, ఇప్పుడు అది ఎలా
- 5:26నుంచుని ఉందో తమకు అర్థం కావడం లేదని ఊరి పెద్దలకు
- 5:30విన్నవించుకున్నారు. ఈ విషయం విన్న పెద్దలు కాస్త
- 5:33ఆశ్చర్యపోయి ఆ తరువాత దక్షిణ దిక్కుగా ఉన్న విగ్రహాన్ని అక్కడ
- 5:37నుంచి వేరే చోటుకు తరలించి తూర్పు దిక్కుగా నిలబెడతామని
- 5:41నిర్ణయించుకున్నారు. అనుకున్నదే దడవుగా అక్కడికి
- 5:44వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని కదిలించడానికి ఎన్ని
- 5:47ప్రయత్నాలు చేసినా అదంతా వృధా ప్రయాసగానే మిగిలింది.
- 5:51అప్పుడు శుభగిరి ఊరి. రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చి
- 5:55ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి అక్కడ చిన్న పాత్రను ఏర్పాటు చేసి ఆ
- 6:00తల్లికి పూజలు చేయడం మొదలుపెట్టారని స్థలపురాణం.
- 6:03ఇక ఆ తల్లికి చెంగాలమ్మ అనే పేరు రావడానికి వెనుక కూడా ఒక పురాణ
- 6:07గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆ కాలంలో శుభగిరి ప్రాంతంలోని
- 6:11ప్రజలు తెలుగు, తమిళ భాషలు మాట్లాడడమే కాకుండా.
- 6:15తమిళ పరిగట్లను పాటించేవారు. అందువల్ల ఆ గ్రామ ప్రజలు తేన్
- 6:20కాళీ అని పిలవడం మొదలు పెట్టారు. తమిళంలో తేన్ అంటే దక్షిణం అని ఆ
- 6:25తల్లి చూడడానికి కాళీమాతలా ఉండటం మొత్తంగా దక్షిణ దిక్కుకు
- 6:29చూస్తున్న కాళీమాత అనే అర్థం వచ్చేటట్లు తేలికాలి అని పిలవడం
- 6:33జరిగింది. అయితే.
- 6:35చాలా గమనంలో ఆ పేరు చెంగాలిగా మారిపోయినట్లు, పురాణ గాథ ద్వారా
- 6:39అవగతమవుతోంది. ఆ విధంగా ఆరు శతాబ్దాల క్రితం
- 6:43తేన్ ఖాళీగా కొలవబడ్డ ఆ తల్లిని నేడు చెంగాలమ్మగా భక్తులు కొలవడం
- 6:48జరుగుతోంది. ఇదిలా ఉండగా చెంగలమ్మ వెలసిన
- 6:51కొన్నేళ్లకు ఒక అద్భుతం జరిగింది. పూర్వం కాలింది నది మీదుగా
- 6:55అనేకమంది వర్తకులు వివిధ రకాల వ్యాపారాల నిమిత్తం
- 6:58ప్రయాణించేవారు. ఒకనాడు కొంతమంది మిరియాల
- 7:02వ్యాపారులు బస్తాల నిండా మిర్యాలు తీసుకొని శుభగిరికి దగ్గర్లోని ఒక
- 7:06పట్టణంలో అమ్మడానికి తీసుకువెళ్తున్నారట.
- 7:09చెంగాలమ్మ కొలువైన ప్రదేశానికి వచ్చేటప్పటికి చీకటి పడడంతో
- 7:13వారంతా అక్కడే రాత్రికి బస చేయడం జరిగింది.
- 7:16ఆ రాత్రివేళ ఆ వర్తకుల వద్దకు ఒక ముసలావిడ వచ్చి తనకి తల బాగా
- 7:21నొప్పిగా ఉందని కొన్ని మిరియాలు ఇస్తే కషాయం కాసుకొని తాగుతానని
- 7:25అడిగింది. ఆ వ్యాపారులు తమ వద్ద ఉన్నవి
- 7:28మిరియాలు కావని జొన్నలు అని చెప్పి ఆవిడను పంపించేశారట.
- 7:33ఆ తర్వాత రోజు ఉదయం వర్తకులు తమ సరుకుతో దగ్గర్లోని నగరానికి
- 7:37వెళ్లి విక్రయించబోగా ఆ బస్తాలలో మిర్యాలకు బదులు జొన్నలు ఉండటం
- 7:42చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన వృత్తాంతం మొత్తం ఆ
- 7:45నగరంలోని ఒక పెద్ద మనిషికి చెబితే అతను విషయం గ్రహించి ఆ వర్తకులు
- 7:50బస చేసిన ప్రాంతానికి కొంత దూరంలో వెలసిన అమ్మవారి గురించి ఆమె
- 7:54మహిమల గురించి తెలియజేసి రాత్రి. ఆ ముసలావిడ ఖచ్చితంగా వారిని
- 7:59పరీక్షించడానికి వచ్చిన తీన్ కాళీ అమ్మవారిని చెప్పాడు.
- 8:03దాంతో ఆ వర్తకులు తమ తప్పును తెలుసుకుని ఆ తల్లిని వీడుకోగా
- 8:07ఆవిడ కరుణించి మళ్లీ ఆ బస్తాలలో ఉన్న జొన్నలను మిర్యాలుగా మార్చడం
- 8:12జరిగింది. వాటిని అమ్ముకున్న వ్యాపారులు
- 8:14అందులో వచ్చిన లాభంతో మిర్యాలలా కనబడే బంగారు గింజల హారాన్ని
- 8:19చేయించి చెంగలమ్మ వారికి సమర్పించడం జరిగింది.
- 8:23ఆ తల్లి మహిమల గురించి చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా
- 8:26బాగా తెలియడంతో మెల్ల మెల్లగా ఆ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య
- 8:30కూడా పెరగడంతో చిన్న పాక కాస్త ఒక ఆలయంలా మారడం జరిగింది.
- 8:35కొన్ని రోజుల తర్వాత అమ్మవారికి సమర్పించే బంగారు ఆభరణాల సంఖ్య
- 8:39పెరగడంతో వాటిపై ఒక దొంగ కన్ను పడి ఒక రోజు రాత్రి.
- 8:44గుడిలో దొంగతనం చేయడానికి వెళ్లాడు.
- 8:46ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారులకు గర్భగుడిలో పడి ఉన్న దొంగను చూసి
- 8:51జరిగిన విషయం అడగగా రాత్రి తన అమ్మవారి మిర్యాలహారాన్ని దొంగతనం
- 8:55చేయడానికి వచ్చానని, కానీ ఉన్నట్లుండి అమ్మవారి కళ్లలోంచి
- 8:59వెలుగులు రావడంతో తాను స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు.
- 9:03దాంతో చెంగాలమ్మ గుడికి తలుపులు పెట్టడానికి నిర్ణయించుకున్నారు.
- 9:07అనుకున్నది తడవుగా రెండు తలుపులు చేయించి వాటిని గుడికి తెప్పించి
- 9:11సమయానికి చీకటి పడడంతో. ఆ గుడిలో ఉన్న మద్ది చెట్టుకి
- 9:15వాటిని జారబెట్టి మర్నాడు దెయ్యం వచ్చి వాటిని
- 9:18బిగిద్దామనుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి ఊరి పెద్ద
- 9:21కలలో అమ్మవారు కనపడి తన గుడికి తలుపులు వద్దని తను ఎప్పటికీ
- 9:25బయటకు చూస్తూ తన భక్తులను రక్షించుకోవాలని చెప్పిందట.
- 9:30ఆ మర్నాడు ఉదయం పూరిపెద్ద రాత్రి కలలో జరిగిన విషయాన్ని గ్రామ
- 9:34ప్రజలకు తెలియజేసి అందరూ కలిసి చెంగలమ్మ వారి ఆలయానికి ఆలయానికి
- 9:38వెళ్లారు. అక్కడ ముందు రోజు మద్ది చెట్టుకి
- 9:40జారబెట్టిన తలుపులకు కొమ్మలు, ఆకులు మలచి ఆ చెట్టులో భాగంగా
- 9:45మారిపోయాయి. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు
- 9:48చెంగలమ్మ ఆలయానికి తలుపులు పెట్టించలేదు.
- 9:51ఆ కారణంగానే ఇప్పటికీ ఆలయంలో దొంగతనం జరగకపోవడమే కాదు, రాత్రి
- 9:57వేళలో ఒంటరిగా ఆలయంలోకి వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు.
- 10:02ఇప్పటికీ వీధిలోంచి చూసిన అమ్మవారి విగ్రహం స్పష్టంగా
- 10:05కనిపించటం ఒక వింత అని చెప్పవచ్చు.
- 10:08ఇప్పటికీ దాదాపు ఆరు శతాబ్దాల క్రితం వర్తకులు సమర్పించిన
- 10:12బంగారు మిరియాల హారం పర్వదినాలలో అమ్మవారికి అలంకరణగా వేయడం
- 10:17జరుగుతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.
- 10:20నీటికి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్న
- 10:24వ్యక్తులకు అమ్మవారు వారిని నేరుగా చూస్తున్న అనుభూతి
- 10:27కలుగుతుందని అనేక మంది భక్తులు కథలు కథలుగా చెప్పడం నిజంగా
- 10:32చెంగాళమ్మ శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు.
- 10:35అంతేకాదు అమ్మవారి మహిమను తెలుసుకున్న నేటి శాస్త్రవేత్తలు
- 10:39సైతం నెల్లూరు జిల్లా. శ్రీహరికోట నుంచి సెటిలైట్
- 10:42ప్రయోగం జరిపే ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
- 10:46చేసుకోవడంతో పాటు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ వారి దర్శనం చేసుకున్న
- 10:51తర్వాతే రాకెట్ ప్రయోగం జరిపారంటే ఆ తల్లి మహిమ ఎంతటిదో
- 10:55తెలుసుకోవచ్చు. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 10:58ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 11:01కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- 11:06అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 11:10మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 11:14లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 11:18పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 11:22ఆశిస్తున్నాం.