Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Fiercest Goddess in Kerala? The Untold Story of Thiruvarkadu Bhagavathi Temple | మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం! | Voice of Maheedhar
Transcript
- 0:01దేవాలయాలను సందర్శించి కొద్దిసేపు అక్కడ గడిపితే మనం నిత్యం
- 0:05అనుభవించే బాధలబందీలను మర్చిపోయి మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
- 0:11ఇక అక్కడ వివరణ చేసే పులిహోర దద్దోజనం, లడ్డూ ప్రసాదాలు
- 0:15తినడానికి జనం క్యూడు కడుతుంటారు.
- 0:18ఆ ప్రసాదాల రుచ్చే అలాంటిది మరి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే
- 0:23ఆలయానికి వెళ్లడానికి మాత్రం ధైర్యం సరిపోదు.
- 0:27అలా అని అదేదో భయంకర క్రూరమృగాలు అడవి జంతువులు విష కీటకాలు
- 0:32తిరిగాడి నిర్మానుష్య అరణ్య ప్రాంతాలలో లేదు.
- 0:36సాధారణ జనావాసాల మధ్య ఉన్న ఆలయం ఇక అక్కడ పెట్టి ప్రసాదం గురించి
- 0:42తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవ్వడం ఖాయం.
- 0:45అలాగని అదేదో నవ తరం కుర్రాళ్లు గట్టిన వింత గుడి అనుకుంటే
- 0:49పొరబాటి. అది మన దేశంలోని అత్యంత పురాతన
- 0:53ఆలయాలలో ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే శక్తి
- 0:57క్షేత్రాలకు మూలం ఆలయమే అని కూడా అంటారు.
- 1:01ఈ మాటలు వినగానే ఇంతకీ ఆలయం ఎక్కడుంది?
- 1:04అక్కడికి వెళితే భయం ఎందుకు కలుగుతుంది?
- 1:07అసలు ఆలయంలో పెట్టి ప్రసాదం ఏమిటి?
- 1:10ఆ ఆలయ చరిత్ర ఏమిటి వంటి ఎన్నో సందేహాలు కలుగక మానవు.
- 1:15మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను
- 1:20చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని
- 1:24ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:30వెలుగు నీడ రాత్రి పగలు ముందు వెనుక అనుకూల ప్రతికూల ఇలా
- 1:35సృష్టిలోని ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.
- 1:39అయితే వాటిలో కొన్ని బాహ్య ప్రపంచంలో అందరికి కనిపించే
- 1:43విధంగా ఉంటే కొన్ని మాత్రం అత్యంత గుప్తంగా ఉంటాయి.
- 1:47ఈ రహస్య విధానాలు సాధారణ ప్రజలకి అర్థంకావు.
- 1:52అర్థమైన ఆచరించడం కష్టతరమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం
- 1:57వెనుక ఒక అర్థం. దాని వెనుక మరో పరమార్థం
- 2:00ఖచ్చితంగా దాగి ఉంటాయి. అయితే వాటిని కనుగొనడం మేధావుల
- 2:05వల్ల కూడా కాని పని. అందుకే నేటి తరం శాస్త్రవేత్తలు
- 2:09తాము కనుగొన్న విషయాలు మాత్రమే సరైనవని తక్కినవన్నీ అభూత
- 2:14కల్పనలని కొట్టిపారేసి సగటు మనుషులను వాస్తవాలకు దూరంగా
- 2:18ఉంచుతుంటారు. అయితే వారికి కూడా తెలుసు.
- 2:22మానవ మేధస్సుకు అందని శక్తి ఏదో ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది.
- 2:27ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం గురించి తెలియాలంటే ఈ ఉపఘాతం
- 2:32తప్పనిసరి. ఈ ఆలయం సాధారణమైనది కాదు.
- 2:36సకల చరాచర జగత్తు పుట్టుకకు కారణమైన ఆ మహాశక్తికి ప్రతిరూపం.
- 2:41సాధారణ అర్చన విధులకు దూరం ఈ ఆలయం.
- 2:45అది తిరువత్గాడు భగవతి ఆలయం, కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న
- 2:51పదేంగడి అనే ఊరిలోని మాడాయికావు ఆలయం గురించి ఇప్పుడు మనం
- 2:55చెప్పుకుంటున్నది. ఈ ఆలయాన్ని తిరువగ్గాడు భగవతి
- 2:59ఆలయం అని కూడా అంటారు. ఇది ఒక శివాలయమే కానీ
- 3:03ప్రధానమూర్తి మాత్రం ఆ శివుడి వెనుక ఉన్న భద్రకాళి అమ్మవారు.
- 3:08ఈ మాట కాస్త వింతగానే అనిపించవచ్చు.
- 3:11కానీ ఆలయం గురించి తెలిస్తేనే ఆ మాటకు అర్థం బోధపడుతుంది.
- 3:17మన ఆలయాలలో ఎక్కడికి వెళ్లినా పులిహోర దద్దోజనం వంటి సాత్విక
- 3:21ఆహారాలని దైవానికి నివేదించి మనకు ప్రసాదంగా పంచుతారు.
- 3:26కానీ ఈ ఆలయంలో మాత్రం కోడి మాంసంతో చేసిన పదార్థాన్ని
- 3:30ప్రసాదంగా పంచి పెడతారు. మన తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు
- 3:36ఏ సమయంలో వెళ్ళినా ప్రసాదం అందుబాటులో ఉంటుంది.
- 3:39మన నేతలు ఆధ్యాత్మికతను కూడా వ్యాపారం చేస్తే మనం ఆ
- 3:43వ్యాపారానికి పరోక్షంగా వత్తాసు పలుకుతాము.
- 3:47కానీ ఈ దేశంలో ఇంకా కొన్ని ఆలయాలు గుహనా ప్రభుత్వాల వ్యాపార కాంక్ష
- 3:52నుంచి కాస్తంత దూరంగా ఉండి మనుగడ సాగిస్తున్నాయి.
- 3:56అటువంటి వాటిలో తిరువక్కాడు. భగవతి ఆలయం కూడా ఒకటి.
- 4:01అందుకే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వెళితే ప్రసాదం ఇవ్వరు.
- 4:05అక్కడి చికెన్ ప్రసాదం తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది.
- 4:10అయితే చికెన్ ప్రసాదం దొరుకుతుంది కదా అని ఎగేసుకుని వెళితే
- 4:14ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఈ ఆలయంలో భక్తితో పాటు అదనంగా భయం
- 4:19కూడా దొరుకుతుంది. ఇది చాలా వింతగా అనిపిస్తుంది.
- 4:24మరి ఆ విషయాలు వివరంగా తెలియాలంటే ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకోవాలి.
- 4:30సాక్షాత్తు శ్రీమహా విష్ణువు అవతారమైన పరశురాముడు సృష్టించిన
- 4:34కేరళ రాష్ట్రం గురించి మనం గతంలో చెప్పుకున్నాం.
- 4:38అయితే ఆ కేరళ రాష్ట్ర ఆవిర్భావ ఒక్కసారిగా జరగలేదు.
- 4:42అంచల్ అంచెలుగా జరిగిందని చెప్పడానికి ఈ ఆలయ చరిత్రే ఆధారం.
- 4:48పూర్వం పజయంగడి ప్రాంతంలో దరికుడు దానవేంద్రుడని ఇద్దరు రాక్షసులు
- 4:53ఉండేవారు. వారిలో అత్యంత క్రూరుడు
- 4:56పెద్దవాడైన దరికుడు వారు బ్రహ్మ దేవుడి కైతపస్సు చేసి మానవుల
- 5:01నుంచి దేవతల వరకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేని వరాన్ని
- 5:06పొందారు. యుద్ధం చేసేది ముఖ్యంగా పురుషులే
- 5:09కావడం, స్త్రీలకు యుద్ధవిద్యలు తెలిసిన తమను చంపే బలం ఉండదనే
- 5:14ధైర్యంతో ఆ వరాన్ని పొందారు. ఇక వరప్రభావంతో వారిద్దరూ అందరినీ
- 5:20నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ నరకయాతనలు పెట్టేవారు.
- 5:25అటు వచ్చిన ప్రతి మగవాడిని తెగ నరికేవారు.
- 5:29దేవతలు ఎన్నో సార్లు వారితో యుద్ధం చేసినా ఓటమిపాలయ్యే వారు.
- 5:34ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించమని వారు శివయ్యను కోరగా
- 5:38పార్వతీమాత ఉగ్ర స్వరూపమైన కాళీమాతను పంపించాడు శివయ్య.
- 5:43అలా దరికుడు దానవేంద్రుడిపై పోరాటానికి వెళ్లిన కాళీమాతకు
- 5:48దేవతలు తమ విశిష్ట ఆయుధాలను ఇచ్చి పంపించారు.
- 5:52ఆ తల్లి తన శక్తిని వినియోగించి వారిద్దరిని సంహరించింది.
- 5:57ఆ తర్వాత అక్కడి తపస్సులు ఆమెను అక్కడే వెలయమని కోరారు.
- 6:02దానికి ఆమె తాను వెలయ్యడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలని తనతో
- 6:07పాటు శివయ్యను కూడా దూడుగా ఉండమని కోరింది.
- 6:11కాళీమాత కోరికను మన్నించిన శివయ్య పరశురాముడికి విషయం చెప్పి ఒక
- 6:15ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయమని కోరాడు.
- 6:19పరశురాముడు తన ఘడ్గాన్ని సముద్రంలోకి విసిరి ఇంకొంత స్థలం
- 6:24ఉద్భవించేలా చేశాడు. అదే నేడున్న పదంగిడి కోస్టల్
- 6:28ప్రాంతం. అలా నాడు శివయ్య కాళీమాతతో పాటు
- 6:31రాజరాజేశ్వరి అమ్మవార్లతో కలిసి వెలిశారు.
- 6:35మన పురాణాల ప్రకారం తిరువర్కాడు భగవతి ఆలయంలోని భద్రకాళి మాతి
- 6:40కేరళలో వలసిన తొలి విగ్రహం అనీ, ఆ తర్వాతే తక్కిన కాళీమాత ఆలయాలు
- 6:46వెలిశాయని చరిత్ర విదితం. అందుకే ఆ ఆలయాన్ని శక్తి
- 6:50క్షేత్రాల మూలస్థానంగా చెబుతారు. అయితే ఈ ఆలయంలో స్వామి వారు
- 6:55వెలసినప్పుడు ఉగ్ర స్వరూపమైన కాళీమాతతో పాటు శాంతమూర్తి అయిన
- 7:00రాజరాజేశ్వరి మాట కూడా వెలసినట్లు ముందు చెప్పుకున్నాం.
- 7:05ఒకనాడు ఆ ప్రాంతాన్ని పాలించే చిరక్కెళ్ వంశరాజు కలలో
- 7:08దర్శనమిచ్చిన కాళీమాత తనకు శాకాహార భోజనం కంటే మాంసాహార
- 7:13భోజనమే ఇష్టమని చెప్పి ప్రత్యేకంగా మరో ఆలయం నిర్మించమని
- 7:18కోరిందట. దాంతో ఆ మర్నాడీ రాజు వెళ్లి
- 7:21పూజారులకు ఆ విషయం చెప్పగా అప్పటికప్పుడు అమ్మవారి కోరిక
- 7:25మేరకు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు.
- 7:29అలా అక్కడ రాజరాజేశ్వరి మాటకు ఒక ఆలయం ఉంటే తనతో పాటు ఉండమని
- 7:34అడిగినందుకు శివుడికి కాళీమాతకు మరో ఆలయం ఉంటుంది.
- 7:38పదకొండవ శతాబ్దంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు శాసనాల ద్వారా
- 7:43తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయం కేరళ ప్రభుత్వ
- 7:47మలబార్ దేవస్వం బోర్డు ఆధీనంలో ఉన్న చిరక్కల రాజవంశీయుల అధిపత్యం
- 7:52ఇంకా ఆలయంపై ఉన్నట్లు వారి పూర్వీకులు రాసిన విధివిధానాలని
- 7:57నీటికి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
- 8:01అలా అన్నాడు అక్కడి నంబూద్రిలు తమ తపోశక్తితో నెలకొల్పి ఆ తల్లికి
- 8:06మాంసాహారాన్ని ముఖ్యంగా కోడి మాంసాన్ని వండి నైవేద్యంగా
- 8:10సమర్పించడం, ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడం
- 8:14మొదలుపెట్టినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
- 8:18మన ఆలయాలలో పూజలు నిర్వహించే పూజారులన్నీ కేరళలో నంబూద్రిలని
- 8:23అంటారు. అయితే వీరి పూజా విధానాలకు మన
- 8:27ఆలయాల్లోని పూజారుల విధానాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
- 8:32అందులోనూ శక్తి క్షేత్రాలలో పూజలు చేసి నంబూద్రిలకు తంత్ర
- 8:36విద్యలపై కూడా పట్టు ఉంటుంది. అయితే తంత్ర విద్యను అభ్యసించే
- 8:41విధానాలలో చాలా స్థాయిలు ఉంటాయని నిపుణుల ద్వారా తెలుస్తోంది.
- 8:46అలా తంత్ర విద్యను అభ్యసించిన వారిని తాంత్రిక నమోదూ అని
- 8:49పిలుస్తారు. తిరువర్కాడు భగవతి ఆలయంలో
- 8:53కనిపించే పూజారులందరూ తాంత్రిక నంబూద్రిలే.
- 8:57కేరళ టెంపుల్ స్టైల్ చాలా బాగుంటుంది.
- 9:00అందులోనూ వండిన కోడి మాంసాన్ని ప్రసాదంగా పెడుతున్నారు.
- 9:03అక్కడికి వెళ్లి నాలుగు ఫోటోలు తీయించుకుని ఇచ్చిన ప్రసాదాన్ని ఓ
- 9:07పట్టుబడదామనుకుంటున్నారా? అయితే మీకు తిరువర్గాడు భగవతి
- 9:12ఆలయం గురించి మరో నిజం దాని వెనుక ఉన్న చరిత్ర తెలియాలి.
- 9:16ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు లోపలికి ప్రవేశించగానే రాజరాజేశ్వరి మాత
- 9:21ఇతర దేవతలు దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్లగానే
- 9:26ముందుగా శివయ్య కనిపిస్తారు. ఆయన వెనుక ఉన్న గర్భాలయంలో
- 9:31భద్రకాళి అమ్మవారు ఉగ్రకారంలో కరుణామూర్తిగా దర్శనమిస్తారు.
- 9:36సాధారణంగా స్వామి వారు అమ్మవారు ఒకే గర్భాలయంలో పక్కపక్కన ఉంటారు.
- 9:42లేదా వేరు వేరు ఆలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ముందు
- 9:46స్వామివారు ఆ వెనుక అమ్మవారు ఉండటం కాస్త విచిత్రంగా
- 9:50అనిపించవచ్చు. దానికి కారణం ఇక్కడి కాళీమాత
- 9:54బ్రాహ్మణ స్త్రీతత్వంతో ఉంటుంది. అంటే పూర్వం బ్రాహ్మణ స్త్రీలు
- 9:59ఇంట్లో మాత్రమే ఉండేవారు. బయటకు వచ్చేవారు కాదు.
- 10:04ఒకవేళ వచ్చినా పరదాల మధ్య, ఆమె భర్త లేదా తండ్రి లేదా సోదరుల
- 10:09ఆధ్వర్యంలో చుట్టూ అంగరక్షకుల మధ్య వచ్చేవారు.
- 10:13అదే విధంగా ఇక్కడి కాళీమాతను బ్రాహ్మణ స్త్రీమూర్తిగా
- 10:17చూస్తారు. అందువల్ల ఇక్కడ వెలసిన తల్లిని
- 10:20బ్రాహ్మణ స్త్రీలకు మాతృమూర్తిగా శివయ్యను తండ్రిగా పూజారులు
- 10:25చెబుతారు. ఇక చరిత్ర విషయానికొస్తే.
- 10:28కేరళ రాష్ట్రంలో పదకొండవ శతాబ్దం నుంచి ముస్లింల
- 10:32దండయాత్రలు మొదలయ్యాయి. అంతే కాకుండా కేరళ ప్రాంతానికి
- 10:36వ్యాపార నిమిత్తం రోమ్ నుంచి వ్యాపారులు వారికి తోడుగా వారి
- 10:40అంగరక్షకులు వచ్చేవారు. ఇక కేరళలో ముస్లింల చొరబాటు
- 10:45బందిపోట్లుగా వారు చేసే అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి.
- 10:49మన దేశంలో స్త్రీ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు ఆమెను
- 10:54లక్ష్మీస్వరూపంగా చూస్తాం. ఇంట్లో ఆడపిల్ల పుట్టిన కొత్త
- 10:58కోడలు వచ్చిన లక్ష్మీదేవి వచ్చిందని సంబరాలు చేసుకుంటాం.
- 11:03శ్రీమూర్తిని ఆ ఇంటి పురుషుడి గౌరవానికి ప్రతీకగా భావిస్తాం.
- 11:08ఆ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లినా పరిణామాలు తీవ్రంగా
- 11:13ఉండేది. అందువల్ల వారిని రక్షించుకోవడం
- 11:16పురుషులకు ప్రథమ కర్తవ్యంగా ఉండేది.
- 11:19అందువల్లే ఈ కట్టుబాట్లు మన దేశంలో పెరిగాయి.
- 11:23ముఖ్యంగా ఉత్తర భారతంలో స్త్రీలు ముఖం కనిపించకుండా పరదాలు
- 11:27కప్పుకోవడానికి ముస్లింలఘాయిత్యాలే కారణం అని
- 11:30తెలుస్తోంది. క్రూరమైన ముస్లిం రాజుల
- 11:33కళ్లబడకుండా స్త్రీల ముఖాలు కప్పి ఉంచడానికి పరదాలు మొదలుపెట్టి
- 11:38కాలగమనంలో అదో ఆచారంగా మారిపోయిందని చరిత్రకారులు
- 11:42చెబుతున్నారు. అదే విధంగా కేరళలో బ్రాహ్మణ
- 11:46స్త్రీల చుట్టూ కట్టుబాట్లు పెరిగినట్లు కొంతమంది
- 11:49చరిత్రకారులు బలమైన ఆధారాలను చూపుతున్నారు.
- 11:53ముస్లిం చొరబాటుదారులు ఎంత దారుణంగా ప్రవర్తించేవారో
- 11:57చెప్పడానికి మన గత వీడియోలను చూడండి.
- 12:00అలాగే తిరువర్కాడు భగవతి ఆలయంలో జరిగిన ఒక దారుణం గురించి కూడా
- 12:04తెలియాలి. మన దేశాన్ని ఆక్రమించి
- 12:07దోచుకోవడానికి వచ్చిన ఇస్లాం రాజులను హైదర్ అలీ ఒకడు.
- 12:12అతని సేనలు కేరళ రాష్ట్రంపై దండెత్తినప్పుడు పదేంగిడి
- 12:16ప్రాంతాన్ని పాలించే రాజు ఓడిపోయాడు.
- 12:19పసగింగడి రాజు చాలా చిన్న సామంతరాజు కావడం చేత పిశాచాల
- 12:23సమూహం లాంటి వారిని ఎదిరించి నిలువలేకపోయాడు.
- 12:27ఆ సమయంలో పజయంగడిలోని ఆలయాలను కూడా దోచుకుని తిరువక్కాడు భగవతి
- 12:33ఆలయంలోని బంగారంతో పాటు ఆలయంలోని గోవులను కూడా తీసుకెళ్లిపోయారు.
- 12:38ఒక గోవును వధించి దాని రక్త మాంసాలను ఆలయం గోడలపై వెదజల్లి
- 12:43ప్రేగులను గర్భాలయంలోని విగ్రహాలపై వేసారు.
- 12:46అద్భుతులు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర
- 12:50ఆగ్రహానికి గురి చేసింది. దాంతో వెంకయ్య చాతుకొట్టి నాయర్
- 12:55అనే కలరీ వీరుడు తురకల స్థావరానికి వెళ్లి తరువాత వారు
- 12:59చేయబోయే దాడికి సన్నద్ధమవుతున్న ఆ కిరాత కుడిని వాడు 50 మంది
- 13:04సైన్యాన్ని ఒక్కడే ఎదిరించి పోరాడి వధించాడు.
- 13:08ఆనాడు అతడిని ఆ భద్రకాళి శక్తి ఆవహించిందని వెంగయిల్ చాతుకొట్టి
- 13:13చేసిన రుద్రతాండవం గురించి నీటికి స్థానికులు, కథలు కథలుగా
- 13:17చెప్పుకుంటూ జానపద గేయాలుగా పాడుకుంటుంటారు.
- 13:21అలా నాడు వెంగయిల్ చాతకొట్టి ఆకసాయి వాడి తలను నరికి ఆలయ
- 13:26పూజారుల ఎదుట పడేసాడు. ఆ తరువాత వెంగయిల్ జాతకొట్టి
- 13:31కేరళ తమిళనాడు ప్రాంతాలలోని ఎన్నో ఆలయాలను ముస్లింల దాడుల
- 13:35నుంచి రక్షించాడని చరిత్ర చెబుతోంది.
- 13:39ధర్మాన్ని కాపాడటం కోసం ఎడతెరిపిలేని పోరాటాన్ని
- 13:42కొనసాగించిన వెంగయిల్ చాతుకొట్టిని నాయనారని బిరుదుతో
- 13:46గౌరవించారు. నాయనారంటే హైందవ ధర్మాన్ని
- 13:50రక్షించే రుషులని అర్థం. చరిత్ర ప్రకారం హైందవ ధర్మాన్ని
- 13:55కాపాడి ముందు తరాలకు కూడా కొనసాగించే పని ఈ నాయనార్లు
- 13:59చేసేవారని వారు మొత్తం 69 మంది ఉన్నారని చరిత్ర ద్వారా
- 14:04తెలుస్తోంది. నాడు వెంగళుటికి అంతటి
- 14:08బలాన్నిచ్చిన తల్లి సాధారణమైన ఆలయాలలో కనిపించే విగ్రహ మూర్తి
- 14:13కాదు. అత్యంత తీవ్రమైన శక్తితో
- 14:15కూడుకున్న కాళీ స్వరూపం. ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
- 14:20రుజుతి రూపంలో జరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
- 14:25రుజిత అంటే భద్రకాళి యొక్క రౌద్రరూపం.
- 14:28అందుకే ఇక్కడి పద్ధతులన్నీ రుజిత విధానంలోనే ఉంటాయి.
- 14:33శ్రీ విద్యా తంత్రంలో భాగమైన ఒక తంత్ర సాధన ఇది.
- 14:37అందుకే ఈ తిరువర్గాడు భగవతి ఆలయం తంత్ర సాధకులకు అతి ముఖ్యమైన
- 14:42ప్రదేశం. ఈ కారణాల వల్లనే మాడాయి కావు.
- 14:46ఆలయానికి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి.
- 14:49తంత్ర సాధన చేసే ఆలయం అయితే మాత్రం అమ్మను దర్శించుకోవడానికి
- 14:54ఇబ్బంది ఏమిటని కొందరు అడగవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి
- 14:58ఇబ్బందులు కావు. కానీ ఇక్కడికి వచ్చేవారితోనే అసలు
- 15:03చిక్కంత ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులలో సాధారణ భక్తులతో పాటు
- 15:09ప్రీతాలు ఆవహించిన వారు కూడా ఉంటారు.
- 15:12తిరువర్గాడు భగవతి ఆలయంలోని కాళీమాత తంత్ర స్వరూపిణి కావడం
- 15:17చేత ఆమె ఎదుట దుష్ట శక్తులు నిలబడలేవు.
- 15:21దయ్యం పట్టినవారిని మాడాయికావు. ఆలయానికి తీసుకొచ్చి అక్కడి
- 15:25పూజారులతో ప్రత్యేకమైన తంత్ర పూజలు జరిపిస్తే ఆ ప్రేతాల నుండి
- 15:30విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకే అక్కడికి ప్రతిరోజూ అలా
- 15:35దయ్యం పట్టిన వారు చాలా మంది దేశ విదేశాల నుంచి వస్తుంటారు.
- 15:39అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన రోజులను ఆలయంలో దాదాపు అందరూ
- 15:45దెయ్యం పట్టిన వారే ఉంటారని కూడా తెలుస్తోంది.
- 15:48అందుకే ఈ ఆలయానికి వెళ్లాలంటే ధైర్యం చాలా అవసరం.
- 15:53కేరళకు వెళ్లి ఆ తల్లిని దర్శించుకుని ప్రసాదం తిని వచ్చిన
- 15:56వారికి అన్ని విధాలుగా శుభం చేకూరిందని భక్తులు చెబుతున్నారు.
- 16:03ధర్మం రక్షతి రక్షితః. అవకాశం ఉన్నవారు మెంబర్స్‌గా చేరి
- 16:08చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా
- 16:12కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 16:17ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్
- 16:20కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 16:24అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
- 16:28మీకు తెలిసిన తెలుసుకోదగిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 16:32లో తప్పక తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో
- 16:37పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని
- 16:40ఆశిస్తున్నాను.