Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Mridangasaileshwari: The Musical Asteroid Goddess & Her Unbelievable Temple Secrets | Voice of Maheedhar
Transcript
- 0:01మన సనాతన భారతావని ఎన్నో అద్భుతాలకు ఆధునిక సాంకేతిక సైతం
- 0:06అంతుచిత్తని దైనిక శక్తులకు సాక్షి భూతం భారతదేశం అంటే ధర్మం
- 0:11పుట్టిన దేశం అని దైవం నడయ్యాడిన ప్రదేశం అని చరిత్ర ఎంతో ఘనంగా
- 0:16చెబుతుంది. కానీ ఈనాడు చాలా మందికి దైవం
- 0:20ఉనికిపోయిన ఎన్నో సందేహాలు పుట్టుకొస్తున్నాయి.
- 0:24ఒక విధంగా కొందరు పుట్టించారని చెప్పుకోవచ్చు.
- 0:28అటువంటి సందేహాలకు సమాధానంగా తన ఉనికిని ప్రపంచానికి చాటి
- 0:32చెబుతున్న దివ్యమైన శక్తి క్షేత్రం ఒకటి కేరళలో ఉంది.
- 0:36ఆలయంలో నాలుగు సార్లు దొంగతనం జరిగిన ఈ ఒక్కరూ అక్కడున్న
- 0:41ప్రధానమూర్తిని తీసుకెళ్లలేకపోయారు.
- 0:44ఆ దైవశక్తి ఎలా ఉంటుందో చూపిన క్షేత్రం ఇది.
- 0:48ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ
- 0:53విషయాలు చెప్పింది. ఒక పూజారో లేక ఓ హిందుత్వవాదో
- 0:57కాదు. ఒకప్పుడు ఆ ఏరియాలో డీఎస్పీగా,
- 1:00ఎస్పీగా, డీఐజీగా పనిచేసి కేరళ డీజీపీ గారి టైర్ అయిన ఒక
- 1:05కిరస్తానీయుడు. ఈ మాటలు వినగానే ఇంతకీ ఆలయం
- 1:09ఎక్కడుంది? ఆలయంలో ఉన్న ప్రధానమూర్తిని
- 1:12దొంగలు ఎందుకని ఎత్తుకెళ్లలేకపోయారు.
- 1:15పక్క సాక్ష్యాలు లేనిది సొంత వారిని కూడా నమ్మని ఒక పోలీస్
- 1:19ఆఫీసర్. అందులోను పరమతస్థుడు చెబుతున్న ఆ
- 1:22శక్తి విశేషాలేమిటి? అసలు ఆలయం పుట్టు పూర్వోత్తరాలు
- 1:27ఏమిటి అని సందేహాలు కలగడం సహజం. మరి ఆ వివరాలు తెలియాలంటే ఈ రోజు
- 1:32మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:36తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహిధర్.
- 1:43మన భారత దేశం ఎన్నో దివ్యమైన శక్తి క్షేత్రాలకు నిలయం.
- 1:48అటువంటి మహా శక్తివంతమైన క్షేత్రాలలో మృదంగ శైలేశ్వరి ఆలయం
- 1:52కూడా ఒకటి. ఈ ఆలయం కేరళలోని కన్నూర్ జిల్లాలో
- 1:56గల ముజక్కువాని ఊరికి సమీపంలో ఉంది.
- 2:00అసలు మృదంగ శైలేశ్వరి ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆ
- 2:05క్షేత్రం యొక్క చరిత్ర విశిష్టత గురించి ముందుగా తెలుసుకోవాలి.
- 2:09మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు 108
- 2:15దివ్య దుర్గాలయాలను నిర్మించాడని తెలుస్తోంది.
- 2:19ఆ 108 ఆలయాలలో ఒకటి. ఈ మృదంగశైలేశ్వరి ఆలయం ఒకానొక
- 2:24సమయంలో కన్నూర్ దగ్గరలో ఉన్న పర్వతాలపై తపస్సు చేసుకుంటున్న
- 2:29పరశురాముడు. అంతరిక్షం నుంచి ఏదో శక్తివంతమైన
- 2:32వస్తువు ఒకటి దగ్గరలో పడడం గ్రహించి దాని కోసం వెతకగా
- 2:36ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలోనే ఆదిత్య శిలా ఆయనకు దొరికింది.
- 2:42అది అచ్చంగా సంగీత ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే మృదంగ
- 2:46వాయిద్యం ఆకారంలో కనిపించింది. వెంటనే పరశురాముడు తన తపోశక్తితో
- 2:51ఆ విగ్రహంలో సరస్వతి, లక్ష్మి, కాళీమాతల శక్తులను ఆవాహన చేసి
- 2:57ప్రసన్న వదనంతో వెలిగిపోతున్న దుర్గామాత విగ్రహాన్ని మలచి అక్కడ
- 3:01ప్రతిష్టించాడు. పరశురాముడి స్వయంగా విగ్రహానికి
- 3:05ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేసి మృదంగశైలేశ్వరి మాతగా
- 3:10కొలిచాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని
- 3:16నిర్మించి 500 ఏళ్లు అవుతున్నట్లు తెలుస్తోంది.
- 3:20ఇప్పటికీ అంతరిక్షం నుంచి మృదంగ శిల పడిన గోతిని ఆలయ ప్రాంగణంలో
- 3:25మనం చూడవచ్చు. ఇదిలా ఉంటే తాంత్రిక శక్తి
- 3:28సాధనకు ఆలవాలమైన కేరళ రాష్ట్రంలో ఆనాడు మృదంగ శైలేశ్వరి
- 3:33మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో సాక్షాత్తు పరశురాముడి
- 3:37కట్టుదిట్టమైన తాంత్రిక మంత్రబలంతో ప్రతిష్టించాడని.
- 3:41అందుకే అక్కడి అమ్మవారిని చూస్తే ఎదురుగా మన ముందు ఎవరో ఉన్న
- 3:46అనుభూతిని పొందుదామని అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించినవారు
- 3:50చెబుతారు. అంతేకాకుండా మృదంగశైలేశ్వరి
- 3:54అమ్మవారు సరస్వతీ స్వరూపం కావడం చేత సంగీత కళాకారులు చదువులో
- 3:59వెనకబడిన పిల్లలు, బుద్ధిమాన్యం ఉన్న పిల్లలు ఆ తల్లిని దర్శించి
- 4:03పూజిస్తే వారిలోని బుద్ధిమాంద్యం తొలగిపోయి వారికి ఖచ్చితంగా
- 4:08జ్ఞానం పెరుగుతుందని భక్తుల విశ్వాసం.
- 4:11అంతేకాదు భారతీయ నృత్యకళలలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక
- 4:16గుర్తింపును తెచ్చుకున్న నాట్యమైన కథాకళి ఈ మృదంగశైలేశ్వరి ఆలయంలోని
- 4:22పురుడు పూసుకున్నదని తెలుస్తోంది. అయితే.
- 4:25అంతటి ఘనకిట్టి నొందిన ఆలయాన్ని గురించి ప్రపంచానికి తెలిసింది
- 4:30మాత్రం ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి
- 4:33రిటైర్ అయిన. అండ్ జాకోబనీ వ్యక్తి ఇచ్చిన ఓ
- 4:37ఇంటర్వ్యూ వల్లనే అని చెప్పాలి. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని
- 4:42ప్రత్యేకమైన కేసుల గురించి చెబుతున్న క్రమంలో మొదటిసారి
- 4:46మృదంగశైలేశ్వరి ఆలయంలోని ప్రధానమూర్తిని నాలుగుసార్లు
- 4:50దొంగిలించే ప్రయత్నం చేసిన వైనం ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఆ
- 4:55విగ్రహం ఆలయానికి తిరిగి చేరిన తీరు వివరంగా చెప్పారు.
- 4:59అలెగ్జాండర్ జాకోబ్ చెప్పిన వివరాల ప్రకారం 1979 లో తొలిసారి
- 5:05కేరళకు చెందిన ఒక దొంగల ముఠా మృదంగ శైలేశ్వరి అమ్మవారి
- 5:09విగ్రహాన్ని దొంగిలించింది. దాదాపు 3:30 అడుగుల పొడవు ఉండే ఆ
- 5:14విగ్రహం పంచలోహాల వంటి లోహంతో తయారైన అత్యంత పురాతన, పురాతనమైన
- 5:18విగ్రహం. ఆ కాలంలోనే మన దేశంలో ఆ విగ్రహం
- 5:22విరువ దాదాపు కోటి నుంచి 2,00,00,000 మధ్యలో ఉండేదని,
- 5:27ఒకవేళ విదేశాలలో అమ్మగలిగితే ఆ విగ్రహం విలువ మరింత ఎక్కువగా
- 5:31ఉండవచ్చని నాటి పోలీసులు లెక్కగట్టారు.
- 5:35అందుకే దొంగలవా విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారని
- 5:39జాకోబ్ చెప్పారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం
- 5:43ఏమిటంటే దొంగతనం చేసిన తరువాత దాదాపు 200 అడుగుల దూరంలో ఆపి
- 5:48ఉంచిన తమ వాహనం దాకా కూడా దొంగలు విగ్రహాన్ని తీసుకెళ్లలేకపోయారు.
- 5:54దారితో ఆ విగ్రహాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయారు.
- 5:58ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆ విగ్రహాన్ని దొంగలు
- 6:03ఎక్కడైతే భయపడి వదిలి పారిపోయారో అక్కడ మనుషుల మలమూత్రాలు
- 6:07కనిపించాయి పోలీసులకు. ఇదిలా ఉంటే విగ్రహం దొరికిన
- 6:12తర్వాత పూజారులు మళ్లీ శాస్త్రోక్తంగా, మంత్రసహితంగా
- 6:16అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు.
- 6:19ఆ తర్వాత 1983 లో మరోసారి మృదంగ శైలేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని
- 6:25దొంగిలించడానికి ప్రయత్నం జరిగింది.
- 6:28అయితే ఈసారి స్థానిక దొంగల ముఠా కాకుండా తమిళనాడు నుంచి వచ్చిన ఓ
- 6:33కొత్త ముఠా ప్రయత్నించింది. ఎటువంటి సెక్యూరిటీ ఉండని
- 6:37ఆలయంలోకి వారు సులువుగా చొరబడి అక్కడి అమ్మవారి విగ్రహాన్ని
- 6:41తీసుకుని ఈసారి కొంత దూరం వెళ్లిపోయారు.
- 6:45దాంతో చరిత్రలో తొలిసారి ఇంచుమించు 40 రోజులపాటు అమ్మవారి
- 6:49విగ్రహం ఆలయానికి దూరంగా ఉంది. ఆ సమయంలో ఒక సాధువు ఎక్కడి నుంచో
- 6:55వచ్చి 40 మూడవ రోజున అమ్మవారు ఆలయానికి తిరిగి చేరుతారని
- 7:00చెప్పాడు. అలా అమ్మవారి విగ్రహం
- 7:02దొంగిలించబడిన తరువాత హఠాత్తుగా వచ్చిన సాధువు చెప్పినట్లుగానే
- 7:07దొంగతనం జరిగిన 41 వ రోజున కేరళ తమిళనాడు బోర్డర్లోని పాలక్కాడ్
- 7:12జిల్లా ప్రధాన పోలీస్ స్టేషన్ నుంచి విగ్రహానికి సంబంధించిన ఒక
- 7:17సమాచారం కేరళ పోలీసులకు అందింది.
- 7:20ఆ వివరాల ప్రకారం తాము పాలక్కా కోయంబత్తూర్ హైవే పక్కన ఒక
- 7:24విగ్రహాన్ని కనుగొన్నామని, దాని పక్కన ఒక ఉత్తరం కూడా లభించిందని
- 7:29తెలిసింది. ఆ ఉత్తరం ప్రకారం ఆ విగ్రహం మృదంగ
- 7:33శైలేశ్వరి ఆలయంలోని ప్రధానమూర్తి అని వెంటనే ఈ విగ్రహాన్ని తిరిగి
- 7:38ఆలయానికి చేర్చమని రాసి ఉంచారు. అందుకే ఎవరికైనా అటువంటి విగ్రహం
- 7:44పోయిందని కంప్లీట్ వస్తే వెంటనే పాలక్కాడ్ ప్రధాన పోలీస్ స్టేషన్
- 7:48కి వచ్చి తీసుకు వెళ్లవలసిందిగా కేరళ పోలీసులకు తెలియజేసారు.
- 7:53ఆ సమయంలో పాలక్కాడ్ ప్రధాన పోలీస్ స్టేషన్‌లోని వారెవరికీ మృదంగ
- 7:57శైలేశ్వరి అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలియకపోవడంతో.
- 8:02వారు కేరళలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అలా వైర్లెస్ మెసేజ్
- 8:06లు పంపారు. దాంతో అలెగ్జాండర్ జాకోబ్ తన సహచర
- 8:10బృందంతో కలిసి పాలక్కాడ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా అక్కడ జరిగింది
- 8:15చూసి తాము ఆశ్చర్యపోయినట్లు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.
- 8:19విగ్రహం ఆ పోలీస్ స్టేషన్ కి చేరిన క్షణం నుంచి అక్కడి
- 8:23సిబ్బంది అక్కడికి వచ్చిన విజిటర్స్ నేరస్తులు ఇలా అంతా
- 8:28కలిసి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు.
- 8:32ఆ ప్రాంతంలోని పూజారిని కూడా తీసుకు వచ్చి పూజలు చేయించారు.
- 8:36అలా వారికి తెలియకుండా ఆ పోలీస్ స్టేషన్ ఒక అమ్మవారి ఆలయంగా
- 8:41మారిపోయింది. అలా మునుపెన్నడూ కేరళ పోలీస్
- 8:45స్టేషన్ల చరిత్రలో జరగలేదని జాకోబా సంఘటన గురించి విస్మయంతో
- 8:50తెలియజేశారు. ఆ తరువాత ముజక్కున నుంచి కొంతమంది
- 8:54పూజారులు, గ్రామ ప్రజలు వచ్చి ఎంతో వైభవంగా అమ్మవారిని రథం మీద
- 8:59కూర్చోబెట్టి ఆలయానికి తీసుకువెళ్లి వేద మంత్రోచ్ఛారణల
- 9:03మధ్య మృదంగ శైలేశ్వరి విగ్రహాన్ని తిరిగి
- 9:06ప్రతిష్టించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ
- 9:10రధాన్ని ఏర్పాటు చేసింది. పాలక్కాడ్ జిల్లా పోలీసులే.
- 9:14అంతే కాకుండా అమ్మవారి విగ్రహం తిరిగి ఆలయం చేరే వరకు రక్షణగా
- 9:19కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆనాడు సాధువు
- 9:24చెప్పినట్లుగానే అమ్మవారు సరిగ్గా 43 వ రోజునే ఆలయానికి తిరిగి
- 9:29రావడం ఒక విచిత్రమని జాకోబ్ తెలియజేసారు.
- 9:33ఇక మూడోసారి కర్ణాటక నుంచి వచ్చిన మరో ముఠా మళ్ళీ
- 9:36మృదంగసేలేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించారు.
- 9:40వారు ఆ తల్లి విగ్రహాన్ని తీసుకుని కర్నాటక వైపు
- 9:43ప్రయాణిస్తూ వయనాడ్ ప్రాంతానికి చేరుకున్నారు.
- 9:47ఈసారి దొంగతనం జరిగిన 72 గంటల వరకు అమ్మవారి విగ్రహం ఎటువైపు
- 9:52తీసుకువెళ్లారని సమాచారం. పోలీసులకు లభించలేదు.
- 9:57అయితే నాలుగో రోజు సాయంత్రం దొంగలు స్వయంగా పోలీస్ స్టేషన్‌కి
- 10:01ఫోన్ చేసి తాము అమ్మవారి విగ్రహాన్ని పలానా లాడ్జ్‌లో
- 10:05ఫలానా రూమ్ నంబర్ గదిలో విడిచి వెళ్తున్నామని తెలియజేసారు.
- 10:09దాంతో ముజాక్కున్ నుంచి ఓ పోలీస్ బృందం అక్కడికి చేరుకుని ఆ తల్లి
- 10:14విగ్రహాన్ని రికవర్ చేసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి ఒక రథంపై
- 10:19మళ్లీ ఆలయానికి తిరిగి తీసుకొచ్చారు.
- 10:23కొన్ని సంవత్సరాలకు విగ్రహాలను దొంగతనం చేసి ఆ మూడు ముఠాలను
- 10:28కేరళ పోలీసులు బంధించగా, విచారణలో వారు ఎవరికీ
- 10:32నమ్మశికంగాని కొన్ని వాస్తవాలను బయటపెట్టారు.
- 10:35అమ్మవారి విగ్రహం దొంగతనం చేసిన క్షణం నుంచి తాము ఎటు
- 10:39వెడుతున్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో పడిపోయామని చాలాసేపు
- 10:44తిరిగిన చోటే తిరుగుతూ ఉండిపోయామని చెప్పారు.
- 10:48దిక్కుతోచని పరిస్థితిలో మనసంతా ఏదో తెలియని భయం ఆవహించి
- 10:52మానసికంగా కృంగిపోయామని చెప్పారు. అంతేకాదు ఆ విగ్రహాన్ని చేతులలోకి
- 10:58తీసుకున్న మరుక్షణం నుంచి తమకు తెలియకుండానే మలమూత్ర విసర్జన
- 11:02జరిగిపోయిందని చెప్పారు. తమిళనాడుకు తీసుకువెళుతున్న
- 11:06దొంగలు తమకు తెలియకుండానే టాక్సీలో మలమూత్రాలు
- 11:10విసర్జించడంతో డ్రైవర్ తమను తిట్టి క్రిందకు దించేసాడని
- 11:14చెప్పారు. అప్పటికే మానసికంగా క్రొంగిపోయి
- 11:17ఉన్న తమను టాక్సీ డ్రైవర్ దారి మధ్యలోనే దింపేయడంతో తాము కేరళ
- 11:22బోర్డర్ కూడా దాటలేక ఆ హైవే పక్కనే విగ్రహాన్ని వదిలి
- 11:26పరారయ్యామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన జరిగిన
- 11:30మరికొద్ది రోజులకు అదే కేరళకు చెందిన మరో ముఠా అమ్మవారి
- 11:34విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది.
- 11:38ఈసారి వారు ఆలయం నుంచి కనీసం 200 మీటర్లు కూడా వెళ్లలేక
- 11:42విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు.
- 11:46అక్కడికి వెళ్లి చూసిన వారికి అమ్మవారి విగ్రహ పరిసరాలలో గతంలో
- 11:50జరిగినట్లే మనుషుల మలమూత్రాలు కనిపించాయి.
- 11:54కొద్ది రోజుల తర్వాత ఈ ముఠా కూడా పోలీసులకు దొరికిపోయి తాము
- 11:58ముస్లిం మతానికి చెందిన వ్యక్తులమని, ఈ అమ్మవారి గురించి
- 12:02విన్న అది తాము పట్టించుకోలేదని విగ్రహాన్ని దొంగిలించిన క్షణం
- 12:06నుంచి తమ బుద్ధి తమ చెప్పుచేతలలో లేకుండా పోయిందని, మొదటి మూడు
- 12:11ముఠాల దొంగలు ఏదైతే చెప్పారో అదే విధమైన అనుభవాన్ని తాము
- 12:16ఎదుర్కొన్నామని చెప్పినట్లు ఒక క్రిస్టియన్ అయి ఉండి అమ్మవారి
- 12:20శక్తిని ప్రత్యక్షంగా చూశాక. కూడా తల్లిని పూజించడం
- 12:24మొదలుపెట్టానని అలెగ్జాండర్ యాకోబ్ తెలియజేసారు.
- 12:28ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈనాటికీ మృదంగ శైలేశ్వరి
- 12:33అమ్మవారి ఆలయానికి పోలీస్ రక్షణ ఉండదని చాలాసార్లు రక్షణ
- 12:38ఏర్పాట్లు చేసుకోమని పోలీసులు హెచ్చరించినా ఆలయ పూజారులు,
- 12:42స్థానికులు దానికి అభ్యంతరం వెలిబుచ్చారని తెలుస్తోంది.
- 12:47అమ్మవారు ఎక్కడికి పోరని ఎవరు తస్కరించి తీసుకెళ్లి ప్రయత్నం
- 12:51చేసినా వారే తిరిగి తీసుకొచ్చి అప్పగిస్తారని అలెగ్జాండర్ జాకో
- 12:56అదే ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఓం శ్రీమాత్రి నమః.
- 13:03అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న
- 13:07ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
- 13:12మరి మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 13:15మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 13:18సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్
- 13:23చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదల్చిన
- 13:27విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి వీడియో.
- 13:32కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా
- 13:35ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.