Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Unseen Path: Secrets of the AFTERLIFE Revealed | మృత్యువు | Voice of Maheedhar
Transcript
- 0:01జాత స్నేహితుడు ఓ మృత్యువు ధ్రువం జన్మ మృత స్వేచ్ఛ తస్మాద పరిహారి
- 0:07దేనత్వం సో చిత్తు మర్హశి. పుట్టిన వారికి మరణం తప్పదు.
- 0:12మరణించిన వానికి మరల జన్మము తప్పదు కాబట్టి అనివార్యమైన ఈ
- 0:18విషయాన్ని గురించి సూచించవద్దని అంటాడు.
- 0:21భగవద్గీతలో గీతాచార్యుడు జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం.
- 0:26మనం ఏదో ఒకరోజు మృత్యువు ఒడిగి చేరాల్సిందే అన్నది.
- 0:31తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేది తెలియనిది మరణం కాబట్టి
- 0:36అనివార్యమైన మృత్యువును గూర్చి తెలివైనవాడు శోకించడని
- 0:40శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
- 0:44కల్పంతరాల జీవాత్మ ప్రయాణంలో ఇప్పుడు మనం చూస్తున్న జీవితం
- 0:48ఒకానొక మజిలీ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం అందరూ
- 0:53మనుషులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం
- 0:58చూస్తూనే ఉన్న ఏదో ఒకరోజు మనము చనిపోతామని మాత్రం అనుకోరు.
- 1:03దీనికన్నా మించిన ఆశ్చర్యం ఉంటుంది.
- 1:07జీవితంలో అతి పెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు
- 1:11వర్గీకరించారు. అసలు ఈ జీవితం ఏమిటి?
- 1:15జీవన ప్రక్రియ యొక్క ముగింపును సూచించే ఆ మరణం సంభవించిన తర్వాత
- 1:21ఏం జరుగుతుంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మన
- 1:25వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:29తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:35జీవన ప్రవాహం అనంత మనం అనంత కాలం నుండి మనుగడ సాగిస్తూనే ఉన్నాము.
- 1:41ఇక ముందు కూడా అనంత కాలం వరకు సాగిస్తూనే ఉంటాం.
- 1:46కానీ మనం తల్లి గర్భంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మనం
- 1:50మనుగడ మొదలైందని హృదయ స్పందన ఆగిపోగానే మరణం సంభవిస్తుందని
- 1:55భ్రమపడుతూ ఉంటారు చాలామంది. అది మన అజ్ఞానంతో కూడుకున్న అంధ
- 2:00విశ్వాసం. ఆధునిక భౌతిక విజ్ఞానం ప్రకారం
- 2:04జీవుడు స్వతంత్ర శక్తి కాదని శరీరమే జీవమని మృత్యు అనంతరం
- 2:09దానికి అస్థిత్వం ఉండదని దానికున్న పరిమిత జ్ఞానం.
- 2:14దీనిని బట్టి భౌతిక విజ్ఞానం ఇంకా బాల్యావస్థలోనే ఉన్నదని
- 2:18తెలుసుకోవాలి. విద్యుత్ యొక్క గతికి సంబంధించి
- 2:22ఇప్పటివరకు మూడు పదుల పైబడిన సిద్ధాంతాలు ప్రతిపాదింపబడ్డాయి.
- 2:27ప్రతి కొత్త సిద్ధాంతం అంతకుముందు ప్రతిపాదింపబడిన సిద్ధాంతాలను
- 2:32ఖండిస్తుంది. కానీ ఇంతవరకు విద్యుత్ గతి యొక్క
- 2:36వాస్తవ పరిస్థితి మనకు తెలియదు. ఆధ్యాత్మిక విషయాలను భౌతిక
- 2:41శాస్త్రంతో ముడిపెట్టడం వలన మనకి దుర్గతి సంభవించింది.
- 2:46శరీరమే జీవమని ఒక శాస్త్రజ్ఞుడంటాడు.
- 2:50ఇంకొక శాస్త్రజ్ఞుని కథనం ప్రకారం మృతాత్మ యొక్క ఆశ్చర్యకరమైన గతి
- 2:55విధులు ప్రామాణికం చేయబడతాయి. మూడవ వైజ్ఞానికుడు ఒక అబోధబాలుడి
- 3:01100 పూర్వ జన్మ కథనం విని ఆశ్చర్యచకితుడవుతాడు.
- 3:05అది పూర్వ జన్మ సిద్ధాంతానికి బలం చేకూర్చుతుంది.
- 3:10శిశువు జన్మించగానే పాలు త్రాగడం ప్రారంభిస్తుంది.
- 3:14పూర్వ స్మృతి లేకుండా అది ఎలా సాధ్యం?
- 3:17చాలా మంది పసిపిల్లలు ఎన్నో అద్భుతమైన గుణగణాలు కనిపిస్తాయి.
- 3:23అటువంటి జ్ఞానం పూర్వ జన్మకు సంబంధించినదే కానీ ఈ జన్మకు
- 3:27సంబంధించినది కాదు. జీవము శరీరము ఒకటి కాదు.
- 3:33శరీరానికి దుస్తులు తొడిగినట్లుగానే జీవం శరీరాన్ని
- 3:36తొడుక్కుంటుంది. జీవితం అంతా ఒకే దుస్తులు
- 3:40సరిపోనట్లుగానీ, ఆత్మ యొక్క అనంత ప్రయాణంలో ఒకే దేహం పనికి రాదు.
- 3:46తడవ తడవకు మార్చవలసిన అవసరం అనివార్యం.
- 3:50సాధారణంగా దుస్తులు జీర్ణమైన తరువాతనే వదిలివేయబడతాయి.
- 3:55కానీ కొన్ని సందర్భాలలో కాలిపోయినప్పుడు కొర్రు బట్టి
- 3:59చినిగిపోయినప్పుడు ఎలుకలు కొట్టేసినప్పుడు మరి ఇతర కారణాల
- 4:03వల్లనూ కొద్దికాలంలోనే వదిలివేయడం జరుగుతుంది.
- 4:07శరీరం కూడా సాధారణంగా వృద్ధాక్యం వల్ల జీర్ణమైనప్పుడు మాత్రమే
- 4:13జీవుని చేత వదిలివేయబడుతుంది. కానీ కొన్ని ఆకస్మిక కారణాల వల్ల
- 4:18అల్పాయువులోని విసర్జించబడుతుంది. మనిషిలో మృత్యువు ఏ విధంగా
- 4:23వస్తుందని జిజ్ఞాస ఉండటం సహజమే. తత్వవీధులైన యువకుల కథనం ప్రకారం.
- 4:29మృత్యువు ఆసన్నమయ్యే కొద్ది కాలం ముందు మానవులకు మనోవేదన పీడ
- 4:34కలుగుతాయి. దీనికి కారణం నాడులలోని ప్రాణం
- 4:38కదిలి ఒకే చోట ఏకత్రీతం కావటమే. కానీ పూర్వాభ్యాస దోషం వలన ఆ
- 4:45ప్రాణశక్తి తిరిగి మరలిపోవడం వలన అఘాతం ఏర్పడుతుంది.
- 4:50అది పీడకు కారణం రోగం వల్లనూ, దెబ్బల వల్లనూ మరి ఇతర కారణాల
- 4:56వల్లనూ మృత్యువు కలిగితే దాని కారణంగా కూడా పీడ కలుగుతుంది.
- 5:01మరణానికి ముందు జీవి చాలా అవస్థలను పడి కొద్ది సేపటికే
- 5:05మోర్చావస్థకు చేరుతుంది. అటువంటి అకేతనావస్థలో ప్రాణం
- 5:10శరీరాన్ని వదిలి బయటకు పోతుంది. మరణ సమయంలో మనుష్యుని సమస్త బాహ్య
- 5:16శక్తులు అంతర్ముఖమవుతాయి. తరువాత స్థూల శరీరాన్ని వదిలి
- 5:20బయటకు పోతుంది. పాశ్చాత్య మతాల ప్రకారం జీవుని
- 5:24సూక్ష్మ శరీరం కప్ప రంగులో బయటకు పోతుంది.
- 5:28భారతీయ యోగులు మాత్రం అది శుభ్ర శ్వేత వర్ణజ్యోతి లాగా
- 5:33బయటపడుతుందని తెలియజేస్తారు. జీవితంలో జరిగిన చాలా విషయాలను
- 5:38మరచిపోయి మస్తిష్కంలోని సుశుప్త అవస్థ లో ఉంచుకోవడం జరుగుతుంది.
- 5:44మరణ కాలంలో అవన్నీ ఒక్కసారిగా జాగృతి చెంది మూకుమ్మడిగా బయటకు
- 5:49వస్తాయి. ఆ కారణంగా కొన్ని క్షణాల్లోని
- 5:52జీవితకాలంలో జరిగిన సంఘటనలన్నీ సినిమా చూసినట్లు చూడటం
- 5:57జరుగుతుంది. ఆ సమయంలోని మనసుకు గల
- 6:00ఆశ్చర్యకరమైన శక్తిని గురించి తెలుస్తుంది.
- 6:04అప్పుడు చూసే సంఘటనలలో సగం మానసిక దృశ్యాలను చూడటానికి సహజంగా ఒక
- 6:10జీవితకాలం సరిపోదు. కానీ ఆ సమయంలో కొద్ది క్షణాలలోని
- 6:15అన్నీ కనిపిస్తాయి. మరణానంతరం ఆ సంఘటనలన్నీ ఘనీభవించి
- 6:20సంస్కారాలుగా మృతాత్మ వెన్నంటి ఉంటాయి.
- 6:24ఆ సమయంలో మనసుకు కలిగే పెద్ద వర్ణనాజీతమే.
- 6:28భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లు ఒక్కసారిగా 1000
- 6:32తేళ్లు కొట్టినంత బాధ కలుగుతుంది. ఒకానొకప్పుడు ఒకడు సగం స్పృహలో తన
- 6:38కుమారుడి తలను కత్తితో ఖండించాడు. ఆ తర్వాత అతని మానసిక వ్యధ
- 6:43వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితి
- 6:47ఇప్పుడు మృతాత్మకు కలుగుతుంది. జీవితంలో ఎంతో సమయాన్ని అంది
- 6:52వచ్చిన ఎన్నో ధార్మిక అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయామి అనే
- 6:58బాధ క్రుంగదీస్తుంది. పుత్ర మరణానంతరం శరీరానికి కష్టం
- 7:03లేకపోయినా మనసుకు అపరిమిత బాధ కలిగినట్లే.
- 7:06మరణానంతరం కూడా శారీరక వేదన లేకపోయినప్పటికీ మానసిక వ్యధ
- 7:11భరించలేనంతగా ఉంటుంది. రోగం మొదలైన శారీరిక పీడలు మనస్సు
- 7:17అంతర్ముఖం కాగానే అదృశ్యమైపోతాయి. మృత్యుకు పూర్వ క్షణాలలో శరీరం తన
- 7:23కష్టాలను సహించగలుగుతుంది. రోగం వల్ల గాని దెబ్బల వల్ల గాని,
- 7:29శరీరానికి ఆత్మకు గల బంధాలు క్రమక్రమంగా తొలగిపోనారంభిస్తాయి.
- 7:35మగ్గిన పండు చెట్టు నుండి రాలే అవస్థ చందాన శరీరం శిథిలమై
- 7:39అచేతనత్వ స్థితికి చేరగానే మృత్యువు సంభవిస్తుంది.
- 7:44నోరు కళ్లు, చెవులు నాసికారంధాల ద్వారా ప్రాణశక్తి
- 7:48నిష్క్రమిస్తుంది. దుష్ప్రవృత్తి గలవారు
- 7:52మరణించేటప్పుడు మాత్రం అది మలమూత్ర రంధ్రాల గుండా
- 7:55నిష్క్రమిస్తుంది. యోగులు బ్రహ్మరథం ద్వారా ప్రాణ
- 8:00త్యాగం చేస్తారు. మన చుట్టూ జరిగే మరణాలలో ఇటువంటి
- 8:04విషయాలు గమనించవచ్చు. శరీరము నుండి నిష్క్రమించిన
- 8:08వెంటనే జీవం ఒక విచిత్రమైన అవస్థలో పడుతుంది.
- 8:13కష్టపడి చాకిరీ చేసిన తరువాత మెత్తటి సేయపై పడుకోగానే గాఢ
- 8:17నిద్రపట్టినట్లుగా ఉంటుంది. ఆ సమయంలో ఆత్మ పరిస్థితి.
- 8:22మృతాత్మ జీవితమంతా పడిన శ్రమకు అటువంటి నిద్రావస్థ అవసరం.
- 8:27ఆ నిద్ర వల్ల జీవునికి గొప్ప శాంతి కలుగుతుంది.
- 8:31మునుముందు చేయవలసిన పనులు చేయడానికి తగిన శక్తి
- 8:35లభిస్తుంది. మరణించిన వెంటనే నిద్ర రాదు.
- 8:39కొంత సమయం ఉంటుంది. దానికి ఇంచుమించు ఒక నెల రోజులు
- 8:44పడుతుంది. అందుకు కారణం మరణించిన తర్వాత
- 8:47కూడా మృతాత్మకు తన జీవిత వాసనలు దృఢంగా ఉంటాయి.
- 8:52నిదానంగా శిథిలమై అదృశ్యమవుతాయి. ఎక్కువగా శ్రమజేసిన వెంటనే సహజంగా
- 8:58రక్త ప్రసరణ తీవ్ర గతిని అందుకుంటుంది.
- 9:01అటువంటి సమయంలో పక్క మీద పడుకున్న తర్వాత కూడా మెలకువగా ఉన్నంతసేపు
- 9:07తీవ్రంగానే ఉంటుంది. మృతాత్మ స్థూల శరీరాన్ని వదిలిన
- 9:11తర్వాత సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితమవుతుంది.
- 9:15సూక్ష్మ శరీర నిర్మాణం కూడా అచ్చంగా స్థూల శరీరంలానే ఉంటుంది.
- 9:21మృతాత్మకు శరీరం తేలికైపోయినట్లు పక్షిలా గాలిలో ఎగురుతున్నట్లు
- 9:26అనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్థితిలో మృతాత్మ కోరుకున్న
- 9:31విధంగా కోరుకున్న చోటుకు వెళ్లగలుగుతుంది.
- 9:35స్థూల శరీరాన్ని వదిలిన తరువాత అది కొంతకాలం వరకు మృత శరీరం
- 9:39సమీపంలోని సంచరిస్తుంది. చుట్టూ చేరి ఏడుస్తున్న బంధువులను
- 9:44ఓదార్చాలని తన శరీరంలోకి తిరిగి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది.
- 9:50కానీ అది సాధ్యం కాదు. ఒక యోగితో ఒక ప్రీతాత్మ ఇలా
- 9:55అన్నది నేను మరణానంతరం గొప్ప నిద్గీవ స్థితిలో పడి ఉన్నాను.
- 10:00స్థూల శరీరం మీద బంధుజనుడ మీద ఉన్న మోహం కారణంగా వారితో
- 10:05మాట్లాడాలని ఏదో ఆరాటం. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను
- 10:10గానీ ఎవ్వరూ నన్ను గమనించడం లేదు. నేను అందరి మాటలు వింటూనే ఉన్నాను
- 10:16గానీ నా మాటలను వినేవారే లేకపోవడం చాలా బాధ కలిగింది.
- 10:21అలాంటి సమయంలోనూ సంతోషం కలిగించే విషయం నా శరీరం చాలా తేలిక కావడం
- 10:27ఎంతో వేగంతో అన్ని వైపులకు ప్రయాణం చేయగలగటం.
- 10:31జీవితం అంతా నేను మరణమంటే భయపడుతూనే ఉన్నాను గాని, ఇప్పుడు
- 10:36నాకు భయం అంటే ఏమిటో తెలియదు. సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితం
- 10:41కావడం వల్ల ఇప్పుడు నాకు కస్తువుల శరీరం మీద మమకారం లేదు.
- 10:46దానికి కారణం నా నూతన శరీరం. పూర్వ శరీరంతో పోలిస్తే ఇది చాలా
- 10:52బాగుంది. నా అస్తిత్వంలో మార్పు ఏమి
- 10:55కనిపించడం లేదు. నా చేతులు, కాళ్లు ఆడిస్తుంటే
- 10:59మామూలుగానే ఉంది. మరణించిన టీవీ లేదు.
- 11:03ఇప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం మరణమంటే ఒక శరీర పరివర్తన
- 11:08ప్రక్రియ మాత్రమే గానీ భయపడనవసరం లేదు.
- 11:12మృత శరీరానికి అంత్యెష్టి జరిగేంత వరకు మృతాత్మ మృత శరీరం
- 11:16దరిదాపుల్లోనే తిరుగుతూ ఉంటుంది. శరీర దహనమైన తర్వాత నిరాశే చెంది
- 11:22మనస్సును మరో ప్రక్కకు మరలుస్తుంది.
- 11:26అయినప్పటికీ చాలా రోజుల వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
- 11:30అధిక అజ్ఞానం వల్ల మాయా మోహాల కారణంగా మృతాత్మ స్మశానాలలోని
- 11:36ఎక్కువగా సంచరిస్తుంది. తరువాత తనకు ప్రియమైన వారి దగ్గర
- 11:40ఉండటానికి ప్రయత్నిస్తుంది. వృద్ధాప్యంలో మరణించిన వారికి ఈ
- 11:45వాసనలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు త్వరలోనే నిద్రలోకి
- 11:50వెళ్లిపోతారు. స్త్రీలలో వాసనలు అధికంగా ఉండటం
- 11:54వల్ల చాలా కాలం విలపిస్తూ ఉంటారు. వారిలో ఎక్కువ మంది అకాల
- 11:59మృత్యువాత పడినవారు లేక ఆత్మహత్యలు చేసుకున్న వారు అయ్యి
- 12:04ఉంటారు. హఠాత్తుగా ఉగ్ర వేదన తర్వాత
- 12:07మృత్యువాత పడడం వలన సూక్ష్మ శరీరంలో స్థూల శరీరానికి
- 12:11సంబంధించిన పరమాణువులు ఎక్కువ పరిమాణంలో అంటిపెట్టుకుని ఉంటాయి.
- 12:16అందువల్ల మరణానంతరం వారి శరీరం కొంత జీవించి కొంత మరణించి కొంత
- 12:21స్థూలంగా కొంత సూక్ష్మంగా ఉంటుంది.
- 12:24అటువంటి ఆత్మల ప్రత స్వరూపంలో కనిపించి అదృశ్యమవుతూ ఉంటాయి.
- 12:30సాధారణ మృత్యువాతబడిన వారికి ఈ విధంగా జరగదు.
- 12:34అందుకు విశేష ప్రయత్నం తపస్సు కావాలి.
- 12:38ఇక అపఘాతం అంటే ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శక్తివంతమైన
- 12:43ప్రేతాత్మ రూపంలో తిరుగుతుంటుంది. ఈ వివరాలను మనం గతంలో చేసిన గరుడ
- 12:49పురాణం వీడియోలో చెప్పుకున్నాం. చూడని వారి కోసం ఆ ప్లేలిస్ట్ ను
- 12:54పొందుపరుస్తున్నాను. అటువంటి ప్రేతాత్మ విషయం మానసిక
- 12:58పరిస్థితి నిద్రను దరిచేరనియ్యదు. ప్రేతాత్మలు ఇంద్రియ వాసనాదృప్తి
- 13:03కోసం లేక ఏదో కసి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
- 13:08అటువంటి ప్రేతాత్మలను కొందరు తాంత్రికులు అసపరుచుకుని తమ
- 13:12బానిసలను చేసుకుంటారు. అలాంటి సమయంలో ఆ ప్రీతాత్మలు ఆ
- 13:17తాంత్రికులపై ప్రసన్నతతో ఉండక విపరీతమైన క్రోధంతో రగిలిపోతూ
- 13:22ఉంటాయి. అవకాశం దొరికితే వాడిని
- 13:25చంపేస్తాయి. బంధం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు.
- 13:29బంధం తొలగించుకోలేక కొన్ని ప్రీతాత్మలు తాంత్రికుడి ఆజ్ఞల
- 13:33మేరకు సర్కస్లో సింహాలలాగా అణిగిమణిగి ప్రవర్తిస్తూ ఉండటం,
- 13:38వాటికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది.
- 13:41కట్టివేయబడిన ప్రీతం ఒకేచోట ఉంటుంది.
- 13:45మాటిమాటికి తన నివాస స్థానాన్ని మార్చుకోదు.
- 13:48తక్కువ వాసనలు కలిగిన లేదా ప్రబుద్ధ చిత్తము కలిగిన
- 13:52ధార్మికులు అంటే అంత్యేష్ఠీ అనంతరం పాత సంబంధాలన్నింటినీ
- 13:57వదులుకుని ఉదాసీన వైఖరిని అవలంభిస్తారు.
- 14:01ఉదాసీనత కలుగగానే నిద్ర వస్తుంది. విశ్రాంతి వల్లన నూతన శక్తి
- 14:06కలుగుతుంది కాబట్టి విశ్రాంతికి అటువంటి నిద్ర అవసరం.
- 14:11ఆ నిద్ర ఎంతకాలం ఉంటుందనేది ఒక నియమానికి కట్టుబడి ఉండదు.
- 14:16అది జీవుని యోగ్యతపై ఆధారపడి ఉంటుంది.
- 14:20చిన్న పిల్లలకు కష్టపడి పనిచేసే వారికి నిద్ర ఎక్కువ మోతాదులో
- 14:24అవసరం. వృద్ధులకు విశ్రాంతిగా గడిపే
- 14:28వారికి తక్కువ మోతాదులో నిద్ర సరిపోతుంది.
- 14:32సాధారణంగా మరణానంతరం కలిగే నిద్ర మూడు సంవత్సరాలు ఉంటుంది.
- 14:37అందులో 1 సంవత్సరం గాఢ నిద్ర కలుగుతుంది.
- 14:41అప్పుడు సూక్ష్మేంద్రియాల సంవేదనను గ్రహించడం
- 14:44సాధ్యపడుతుంది. రెండవ సంవత్సరం నిద్రాభంగమై
- 14:48మునుపటి తప్పులను సరిచేసుకోవడం ముందు కాలానికి అవసరమైన యోగ్యతను
- 14:53సంపాదించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది.
- 14:57మూడవ సంవత్సరం కొత్త జన్మను ధరించే అన్వేషణలో గడుస్తుంది.
- 15:02ఇది సామాన్యంగా జరిగేది కొందరు విశిష్ట వ్యక్తులు ఆరు నెలలలోని
- 15:08తిరిగి తల్లిగర్భంలో ప్రవేశిస్తారు.
- 15:10మరికొందరికి ఐదు సంవత్సరాలు పడుతుంది.
- 15:14ప్రేతాత్మలు 12 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
- 15:18ఆ విధంగా రెండు జన్మల మధ్య అత్యధికమైన అంతరం 12 సంవత్సరాలు.
- 15:24ఇందులో అత్యుత్తమమైన జనన మరణ చక్రాన్ని పొందడానికి మనకున్న
- 15:28ఏకైక మార్గం భగవద్గీత ద్వారానే తెలుస్తుంది.
- 15:32ఈ వీడియో చూసిన వారందరినీ అవకాశం ఉండగానే జాగ్రత్త పడమని
- 15:36కోరుకుంటున్నాను. కృష్ణమ్మంది జగద్గురు.
- 15:42మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
- 15:45మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 15:49సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ అండ్ షేర్
- 15:53చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 15:58విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 16:02వీడియో క్రింది డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 16:05లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.